టేకాఫ్ అయిన వెంటనే పనిచేయని ఏసీ వ్యవస్థ.. పేపర్లే విసనకర్రలు...
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా విమానం ఒకటి ప్రయాణికులను తీవ్రఅవస్థలకు గురిచేసింది. ఈ విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాలకే ఏసీ పని చేయకపోయే సరికి ప్రయాణికులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వివర
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా విమానం ఒకటి ప్రయాణికులను తీవ్రఅవస్థలకు గురిచేసింది. ఈ విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాలకే ఏసీ పని చేయకపోయే సరికి ప్రయాణికులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
వెస్ట్ బెంగాల్‌లోని బగ్‌డోరా నుంచి ఢిల్లీకి విమానం 168 మంది ప్రయాణికులతో ఆదివారం మధ్యాహ్నం 1.55 గంటలకు బయల్దేరింది. విమానం బయల్దేరిన 20 నిమిషాల తర్వాత ఏసీ పని చేయడం లేదని ఎయిరిండియా సిబ్బందికి ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. కాసేపట్లో ఏసీ పని చేస్తుందని సిబ్బంది చెప్పింది. కానీ, ఎంతకూ పని చేయలేదు.
దీంతో తమ వద్ద ఉన్న న్యూస్ పేపర్లను విసనకర్రలుగా ఉపయోగించి.. ఉపశమనం పొందారు. కొద్ది మంది ప్రయాణికులు విమానంలో ఉన్న ఆక్సిజన్ మాస్క్‌లు ఉపయోగించినప్పటికీ.. అవి కూడా పని చేయలేదని వాపోయారు. ప్రయాణికులు కొందరు ట్విట్టర్ ద్వారా ఎయిరిండియా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన కూడా ఫలితం లేకపోయింది.