Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్రపతి ఎన్నికల్లో మెగాస్టార్ మొదటి ఓటు... వ్యతిరేకమా..? అనుకూలమా..?

సినిమాల్లో బిజీ అయిపోయిన తరువాత చిరంజీవి రాజకీయాలు దూరంగా ఉంటూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజ్యసభ సభ్యుడైన చిరంజీవి పదవీకాలం ఇంకా ఉంది. పార్టీ అధికారంలో లేకున్నా కొంతమంది మాత్రం రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతూనే ఉన్నారు. అయితే రాష్ట్ర విభజన, దే

రాష్ట్రపతి ఎన్నికల్లో మెగాస్టార్ మొదటి ఓటు... వ్యతిరేకమా..? అనుకూలమా..?
, సోమవారం, 3 జులై 2017 (11:25 IST)
సినిమాల్లో బిజీ అయిపోయిన తరువాత చిరంజీవి రాజకీయాలు దూరంగా ఉంటూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజ్యసభ సభ్యుడైన చిరంజీవి పదవీకాలం ఇంకా ఉంది. పార్టీ అధికారంలో లేకున్నా కొంతమంది మాత్రం రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతూనే ఉన్నారు. అయితే రాష్ట్ర విభజన, దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులపై అవినీతి ఆరోపణలు రావడం కాస్త ఆ పార్టీని లేవలేని విధంగా చేసింది. ఇది అందరికీ తెలిసిందే. 
 
ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం చాలా కష్టమైంది. చిరంజీవి కూడా పార్టీ పరిస్థితి బాగా లేకపోవడంతో దూరంగా ఉంటూ వచ్చారు. ఒకానొక దశలో ఖైదీ నెంబర్ 150వ సినిమా విడుదల కాకముందే ఆయన వేరే పార్టీలో చేరాలని నిర్ణయం కూడా తీసేసుకున్నారు.
 
అయితే కొంతమంది తన సన్నిహితుల సలహాలతో వెనక్కి తగ్గిన చిరంజీవి ఆ తరువాత సినిమాలపైనే ఎక్కువగా శ్రద్థ చూపారు. తిరిగి తనకు ఇష్టమైన రంగం సినిమాను ఎంచుకున్న తరువాత చిరంజీవికి అదృష్టం అలా అలా కలిసొస్తోంది. అదే మొదటగా ఖైదీ నెంబర్ 150 సినిమా భారీ విజయాన్ని సాధించడం ఆ తరువాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవి బిజీ అయిపోవడం.. అలా మరిన్ని సినిమాలు చిరంజీవికి రావడం జరుగుతోంది. 
 
అయితే అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో చిరంజీవి హాజరవుతూ వస్తున్నారు. అయితే చిరంజీవికి మరో లక్కొచ్చింది. అదే చిరంజీవికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం రావడం. అది కూడా మొదటి ఓటు చిరంజీవిదే. ఎంతో మంది ఎంపిలు, ఎమ్మెల్యేలు ఉంటే లక్కు లాగా చిరంజీవికే మొదటి ఓటు లభించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మగవారితో వ్యభిచారం.. పాకిస్థాన్ యువకుడి నిర్వాకం.. ఎక్కడ?