Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత మరణం.. వైద్య చికిత్సలో ఎలాంటి లోపాల్లేవ్..

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2022 (19:19 IST)
తమిళనాడు సీఎం జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. 2016 డిసెంబర్ 4న అపోలో హాస్పిటల్‌లో ఉన్న జయలలితకు గుండె పోటు రాగా, 5న ఆమె మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అపోలో ఆసుపత్రిలో ఇచ్చిన వైద్య చికిత్సలో ఎటువంటి లోపాలు లేవని ఎయిమ్స్ వైద్యుల ప్యానెల్ నిర్ధారణకు వచ్చింది.
 
ఆరుగురు సభ్యుల ఈ ప్యానెల్‌ను సుప్రీంకోర్టు గతేడాది నవంబర్ 30న నియమించింది. జస్టిస్ అర్ముగస్వామి కమిషన్‌కు కావాల్సిన సాయాన్ని ఈ ప్యానెల్ అందించాల్సి ఉంటుంది.
 
కార్డియాలజిస్ట్ డాక్టర్ సందీప్ సేత్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం చెన్నై అపోలో హాస్పిటల్‌లో జయలలిత చికిత్సా రికార్డులను పూర్తిగా అధ్యయనం చేసింది. రేడియాలజీ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులను కూడా పరిశీలించింది. 
 
ఆసుపత్రిలో చేరడానికి ముందే జయలలితకు మధుమేహం, వర్టిగో, అటోపిక్ డెర్మటైటిస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, హైపోథైరాయిడ్, క్రానిక్ బ్రాంకైటిస్‌కు చికిత్స తీసుకుంటున్నట్టు ప్యానెల్ నిర్ధారణకు వచ్చింది.  

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments