ఢిల్లీలో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్: ప్రధానితో భేటీ

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2022 (17:17 IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీతో భేటీకానున్నారు.
 
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం. అనంత‌రం రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌డ్ ల‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లువ‌నున్నారని స‌మాచారం.
 
ఢిల్లీ పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం 6.30 గంట‌ల‌కు తాడేప‌ల్లి నుంచి బ‌య‌లుదేర‌నున్నారు. రాత్రి 9.15 గంట‌లకు ఢిల్లీ చేరుకుని జ‌న్ ప‌థ్ నివాసంలో బ‌స చేయనున్నారు.

సోమ‌వారం ఉద‌యం ప్రధాని మోదీతో ఆయ‌న భేటీకానున్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంపై ప్రధాని మోదీకి వినతిపత్రం సమర్పించనున్నారు.
 
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం వెచ్చించిన రూ. 2,900 కోట్ల నిధులను విడుదల చేయాలని ప్రధానిని జగన్‌ కోరనున్నారు.

అలాగే ముంపు మండలాల్లో జనం పునరావాసానికి నిధులివ్వాల్సిందిగా ప్రధానికి వినతిపత్రం సమర్పిస్తారు. సవరించిన అంచనాల ప్రకారం రూ. 55వేల 548.87 కోట్ల విడుదలకు అనుమతివ్వాల్సిందిగా సీఎం జగన్‌ కోరనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments