Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషి కొత్త ఎత్తు... శిక్ష తగ్గించాలంటూ గవర్నర్‌కు పిటిషన్

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (08:17 IST)
నిర్భయ కేసులోని దోషుల్లో వినయ్ గుప్తా అనే ముద్దాయి మరో కొత్త ఎత్తు వేశాడు. ఢిల్లీ పాటియాలా కోర్టు ఆదేశాల మేరకు నిర్భయ కేసులోని నలుగురు దోషులకు ఈ నెల 20వ తేది ఉదయం ఉరిశిక్షలను అమలు చేయనున్నారు. అయితే, ఈ శిక్షలను తప్పించుకునేందుకు ఈ నలుగురు ముద్దాయిలు చేయని ప్రయత్నమంటూ లేదు. ఇపుడు వీరికి దారులన్నీ మూసుకునిపోయాయి. 
 
ఈ క్రమంలో వినయ్ గుప్తా అనే దోషి సరికొత్త ఎత్తుగడ వేశాడు. తన శిక్ష తగ్గించాలంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌ను అభ్యర్థించాడు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో తాను అనుభవించిన జైలు శిక్ష తనలో ఎంతో పరివర్తన తీసుకువచ్చిందని, తన కుటుంబ పరిస్థితిని కూడా చూడాలని గవర్నర్‌ను కోరాడు.​
 
మరి, ఇపుడు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో... కోర్టు తాజాగా జారేసిన డెత్ వారెంట్ మేరకు ఈ నెల 20వ తేదీన ఈ నిర్భయ దోషులకు ఉరిశిక్షలను అమలుచేస్తారా? లేదా? అనే అంశంపై ఇపుడు సందిగ్ధత నెలకొంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments