Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

08-03-2020 ఆదివారం మీ రాశిఫలితాలు.. సూర్యనారాయణ పారాయణతో?

Advertiesment
08-03-2020 ఆదివారం మీ రాశిఫలితాలు.. సూర్యనారాయణ పారాయణతో?
, ఆదివారం, 8 మార్చి 2020 (05:00 IST)
సూర్య నారాయణ పారాయణ చేసిన అన్నివిధాలా కలిసివస్తుంది
 
మేషం: మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. పెద్ద హోదాలో ఉన్నవారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ చాలా అవసరం. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
వృషభం: సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థికస్థితి ఆశాజనకం. ఖర్చులు ప్రయోజనకరం. బాకీలు, ఇతరత్రా రావలసిన ఆదాయం అందుతుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు. 
 
మిథునం: భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి. ఉద్యోగస్తులు అధికారులు, సహోద్యోగుల ప్రశంసలందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఏది జరిగినా మంచికేనని భావించండి. త్వరలో ఒక శుభవార్త వింటారు. వ్యాపార ఒప్పందాలు, బయానా చెల్లింపులకు అనుకూలం. 
 
కర్కాటకం: ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. స్త్రీల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. ధనమూలకంగా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం అధికం.
 
సింహం: కుటుంబ ఖర్చులు, పెరిగిన ధరలు, చాలని ఆదాయంతో సతమతమవుతారు. దస్త్రం విషయమై ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. అనుకున్నది సాధించే వరకు శ్రమిస్తారు. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వాహనచోదకులకు ఏకాగ్రత ప్రధానం.
 
కన్య: వృత్తి, వ్యాపార సంబంధాలు బలపడతాయి. ఏ సమస్యనైనా ధీటుగా ఎదుర్కొంటారు. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం ఇబ్బంది కలిగిస్తుంది. దుబారా ఖర్చులు అధికం. మనస్థిమితం అంతగా ఉండదు. బంధుమిత్రుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది.
 
తుల: ఒక పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం ఇబ్బంది కలిగిస్తుంది. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. రాబోయే ఖర్చులకు ఆదాయం సర్దుబాటు చేసుకుంటారు. భాగస్వామిక వ్యాపారాలపై దృష్టి సారిస్తారు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.
 
వృశ్చికం: చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు గడ్డుకాలం. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయడం ఉత్తమం. కొన్ని సందర్భాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం వుంది. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. ఆత్మీయులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. స్త్రీలకు ఆరోగ్య సంతృప్తి, శారీరక పటుత్వం నెలకొంటాయి.
 
ధనస్సు: ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత బలహీనతలు గోప్యంగా వుంచాలి. ఖర్చులు అధికం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. స్త్రీల ఉద్యోగ యత్నం ఫలిస్తుంది. వ్యాపారాల అభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు అమలు చేస్తారు. 
 
మకరం: నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ప్రధానం. ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు భిన్నంగా ఉంటాయి. రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త అవసరం. మీ శ్రీమతి హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. పనులు, యత్నాలు చురుకుగా సాగుతాయి. ఏ సమస్యనైనా ధీటుగా ఎదుర్కొంటారు.
 
కుంభం: వ్యాపారాల అభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు అమలు చేస్తారు. ఆందోళన కలిగించిన సమస్య తేలికగా పరిష్కారం అవుతుంది. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో గడుపుతారు. 
 
మీనం: నూతన దంపతుల మధ్య అవగాహన, ప్రేమాభిమానాలు నెలకొంటాయి. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. క్రయ విక్రయాలు సామాన్యం. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. అవకాశాలు కలిసిరాక, యత్నాలు ఫలించక నిరుత్సాహం చెందుతారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూర్యుడితో స్నేహం చేస్తే.. ఆరోగ్యానికి మంచిది..