Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

06-03-2020 శుక్రవారం రాశిఫలాలు - దుర్గాదేవిని పూజించినా...

Advertiesment
06-03-2020 శుక్రవారం రాశిఫలాలు - దుర్గాదేవిని పూజించినా...
, శుక్రవారం, 6 మార్చి 2020 (05:00 IST)
మేషం : వృత్తి వ్యాపారాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీరు చేసే ఉపకారానికి ప్రత్యుపకారం లభిస్తుంది. మీ సంతానం వివాహ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారు అచ్చు తప్పులుపడుట వల్ల మాటపడక తప్పదు. ధనం పెద్ద మొత్తం ఇంట్లో ఉంచుకోవడం మంచిదికాదు. 
 
వృషభం : సోదరీ సోదరులు సన్నిహితులతో కలిసి సాగించే ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. మీ శక్తి సామర్థ్యాలను నమ్మండి. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఆటోమొబైల్ ట్రాన్స్‌పోర్టు రంగాలలో వారికి జయం చేకూరును. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. 
 
మిథునం : ఆర్థిక లావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. దైవదర్శనాలు తేలికగా అనుకూలిస్తాయి. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా నెమ్మదిగా సమసిపోగలవు. తరచూ వేధించే అధికారుల బదిలీతో ఉద్యోగస్తులు మానసికంగా కుదుటపడుతారు. 
 
కర్కాటకం : ఉపాధ్యాయులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. విదేశాలలోనివారి క్షేమ సమాచారాలు సంతృప్తినిస్తాయి. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. భాగస్వామిక చర్చలలో కొత్త విషయాలు, ఒప్పందాలు చోటుచేసుకుంటాయి. 
 
సింహం : ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తి ఉండజాలదు. హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో ఏమరుపాటుతనం వల్ల ఇబ్బందులు తప్పవు. మీ మేథస్సుకి, వాక్‌చాతుర్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
కన్య : మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. రచయితలకు పత్రికా రంగంలో వారికి కలిసిరాగలదు. నూతన పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనల గురించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యం. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. 
 
తుల : ప్రియతములలో మార్పు మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. పీచు, నార, ఫోము, లెదర్ వ్యాపారస్తులకు యోగప్రదం. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల ఏకాగ్రత అవసరం. ఖర్చులు అంతగా లేకున్నా ధన వ్యయం విషయంలో మెళకువ అవసరం. మీకొచ్చిన సమస్య చిన్నదే అయినా చికాకులు తప్పవు. 
 
వృశ్చికం : మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగులకు, క్యాటరింగ్ పనివారలకు శుభదాయకం. మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ వుండదు. 
 
ధనస్సు : స్త్రీలు, దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. చేపట్టిన పనులు అసంపూర్ణంగా ముంగిచవలసి వస్తుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు, విస్తరిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయాలలోని వారికి కార్యకర్తల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. 
 
మకరం : ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు తమ బంధువర్గాల వైపు నుంచి ఒక సమాచారం అందుతుంది. ప్రముఖులతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. బ్యాంకు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. ప్రింటింగ్, స్టేషనరీ వ్యాపారస్తులకు చురుకుదనం కానవస్తుంది. 
 
కుంభం : నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం. ఆలయాలను సందర్శిస్తారు. రుణాలు తీరుస్తారు. సేవా సంస్థలకు విరాళాలు ఇవ్వడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ యత్నాలకు సన్నిహితులు అన్ని విధాలా సహకరిస్తారు. 
 
మీనం : ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ఎంతో ముఖ్యం. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, ఇన్వెర్టర్ రంగాల వారికి పురోభివృద్ధి. సోదరులతో పరస్పర అవగాహన లోపం తలెత్తవచ్చు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోలీ వేడుకకు దూరంగా రాంనాథ్ : రాష్ట్రపతి భవన్ ప్రకటన