Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

03-03-2020 మంగళవారం మీ రాశిఫలాలు - కార్తికేయుడిని పూజించినా...

Advertiesment
03-03-2020 మంగళవారం మీ రాశిఫలాలు - కార్తికేయుడిని పూజించినా...
, మంగళవారం, 3 మార్చి 2020 (05:00 IST)
మేషం : ఆర్థికంగా ఫర్వాలేదు. అయితే, మీకు తెలియకుండానే దుబారా ఖర్చులవుతాయి. బంధువులతో అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పైఅధికారులతో మాటపడవలసి వస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. 
 
వృషభం : ఉద్యోగస్తులు పైఅధికారులతో సంభాషించేటపుడు మెలకువ వహించండి. విదేశాలు వెళ్లడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ సంతానం ఆరోగ్యం, విద్యా విషయాల గురించి ఆలోచన చేస్తారు. తలపెట్టిన పనులు సామాన్యంగా సాగుతాయి. 
 
మిథునం : హోటల్, కేటరింగ్  రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తిచేస్తారు. దంపతుల మధ్య అవగాహన కుదరదు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభంకాగలవు. రావలసిన మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. 
 
కర్కాటకం : ఒక కార్యం నిమిత్తం దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన అమలులో పెడతారు. కుటుంబీకులతో కలిసి దైవ, దర్శనాలలో పాల్గొంటారు. విద్యా సంస్థలలో వారు నిరుత్సాహం ఎదుర్కొనవలసి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. 
 
సింహం : మీ జీవిత భాగస్వామికి అన్ని విషయాలు తెలియజేయడం మంచిది. రాజకీయాలలో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహించుట వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. మీపై సెంటిమెంటలు, స్వప్నాల ప్రభావం అధికంగా ఉంటుంది. 
 
కన్య : ఉద్యోగస్తులకు యూనియన్ కార్యకలాపాల వల్ల క్షణం తీరిక ఉండదు. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సదావకాశాలు లభిస్తాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీముల కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. 
 
తుల : వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, జాప్యం పెరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. 
 
వృశ్చికం : ఆదాయ వ్యయాల్లో సంతృప్తి కానవస్తుంది. ఆహ్వానాలు అందుకుంటారు. విలువైన వస్తువులు ఆభరణాలు అమర్చుకుంటారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. కపటం లేని మీ ఆలోచనలు సలహాలు మీకు అభిమానులను సంపాదించి పెడుతుంది. ప్రైవేటు సంస్థలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. 
 
ధనస్సు : ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. రాజకీయ కళా రంగాల వారికి యోగప్రదంగా ఉంటుంది. 
 
మకరం : ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది. కళ, క్రీడ, సాంకేతిక, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. ముఖ్యమైన విషయాల్లో అందరికీ ఆమోదయోగ్యమైన సలహాలు తీసుకుంటారు. బంధు మిత్రులతో కలహాలు తలెత్తుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. వ్యాపారాలు ప్రణాళికా బద్ధంగా సాగుతాయి. 
 
కుంభం : ఉద్యోగస్తులకు తోటివారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో ఒకరి సహాయం తీసుకోవడం మంచిది. ఆడిట్, అకౌంట్స్, కంప్యూటర్ రంగాల వారికి పనిభారం అధికం. ధ్యేయ సాధనకు విద్యార్థులు మరింతగా శ్రమించాలి. ఆలయాలను సందర్శిస్తారు. 
 
మీనం : పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత, పునరాలోచన మంచిది. ఇతరులకు మీ బాధ్యతలు అప్పగించి ఇబ్బందులెదుర్కొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో మీ శ్రీమతి సలహా తీసుకోవడం ఉత్తమం. స్త్రీలకు తల, కళ్లు, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. కోర్టు దావాలు ఉపసంహరించుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

02-03-2020-సోమవారం మీ రాశి ఫలితాలు.. మల్లికార్జునుడిని ఆరాధించినట్లైతే?