Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

02-03-2020-సోమవారం మీ రాశి ఫలితాలు.. మల్లికార్జునుడిని ఆరాధించినట్లైతే?

Advertiesment
02-03-2020-సోమవారం మీ రాశి ఫలితాలు.. మల్లికార్జునుడిని ఆరాధించినట్లైతే?
, సోమవారం, 2 మార్చి 2020 (05:00 IST)
మల్లికార్జునుడిని ఆరాధించినట్లైతే మీ సంకల్పం సిద్ధిస్తుంది
 
మేషం: వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు శుభదాయంకాగ ఉంటుంది. పోర్టు, ట్రాన్స్‌పోర్ట్, రంగాల వారికి పురోభివృద్ధి. ముఖ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి, చికాకులు అధికమైనా సంతృప్తి కానవస్తుంది. 
 
వృషభం: సినిమా, సాంస్కృతిక, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు చిన్న అవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం చాలామంచిది. రాజకీయ నాయకులకు మెళకువ అవసరం. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. ఎప్పటి వరకు వాయిదా పడుతున్న పనులు పునః ప్రారంభమవుతాయి. 
 
మిథునం: బ్యాంకు లావాదేవీలకు అనుకూలం. ఖర్చులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్త్రీలు వస్తువులు కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్యులు మధ్య అవగాహనం లోపం. తొందరపడి వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి.
 
కర్కాటకం: ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. చిట్స్, ఫైనాన్స్, చిట్‌ఫండ్ వ్యాపారస్తులకు ఓర్పు, నేర్పు చాలా అవసరం. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వ్యవసాయ, తోటలు రంగాలలో వారికి అనుకున్నంత సంతృప్తి కానరాదు. ఆపత్సమయంలో స్నేహితులు అండగా నిలుస్తారు. 
 
సింహం: సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన అమలులో పెడతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దంపతుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉద్యోగస్తులు అపరిచిత మెలకువ అవసరం. స్త్రీలకు నూతన పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి.
 
కన్య: వృత్తి, ఉద్యోగాలలో శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. గత స్మృతులు జ్ఞప్తికి రాగలవు. క్రయ, విక్రయ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. విద్యార్థులు ఇతరుల కారణంగా మాటపడవలసి వస్తుంది. వైద్యులకు శాస్త్రచికిత్స చేయునప్పుడు మెళకువ అవసరం.
 
తుల: గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. మీ సంతానం చేయు పనులు మీకెంతో చికాకులు కలిగిస్తాయి. బంధువులను కలుసుకుంటారు. ఒక శుభకార్యం నిశ్చయం కావటంతో స్త్రీలలో ఉత్సాహం, హడావుడి చోటుచేసుకుంటాయి. ద్విచక్రవాహనం పై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి.
 
వృశ్చికం: స్త్రీలు విలువైన వస్త్రాలు, ఆభరణాలు అమర్చుకుంటారు. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటిన మిత్రుల సహాయ సహకారాల వలస సమసిపోగలవు. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్ రంగాల వారికి పనివారితో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. రాజకీయాల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
ధనస్సు: సాహిత్య సదస్సుల్లోను, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి నిరుత్సాహం, ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. సోదరి, సోదరులతో అవగాహన లోపం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మీ వ్యక్తిగత విషయాలు బయటకు తెలియకుండా గోప్యంగా వుంచండి. 
 
మకరం: ఆర్థిక లావాదేవీలు, కీలకమైన చర్చలు సానుకూలమవుతాయి. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు సంతృప్తినిస్తాయి. ఖర్చులు అధికం కావడంతో ఒకింత ఒడిదుడుకులకు లోనవుతారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
కుంభం: మీ మాటకు కుటుంబంలో ఆదరణ లభిస్తుంది. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బంధువుల రాకతో గృహంలో ఖర్చులు అధికమవుతాయి.
 
మీనం: ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో ఆగివున్న పనులు పునఃప్రారంభం అవుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. మీ పెద్దల వైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది. రాజకీయ నాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసాన్ని కలిగిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

01-03-2020 ఆదివారం మీ రాశి ఫలితాలు