Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

09-03-2020 సోమవారం మీ రాశి ఫలితాలు.. ఉమాపతిని ఆరాధిస్తే..?

webdunia
సోమవారం, 9 మార్చి 2020 (05:00 IST)
ఉమాపతిని ఆరాధించినట్లైతే శుభం, జయం చేకూరుతుంది. 
 
మేషం: పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. మీ వాక్చాతుర్యానికి తెలివితేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దైవసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. 
 
వృషభం: విరోధులు వేసే పథకాలు తెలివితో తిప్పిగొట్టగలుగుతారు. ఒక వేడుకను ఘనంగా చేసేందుకు సన్నాహాలు మొదలెడతారు. స్త్రీలకు ఉపాధి పట్ల ఆసక్తి పెరుగుతుంది. నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. పెద్దలతో సోదరుల విషయాలు చర్చకువస్తాయి. 
 
మిథునం: స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించడం మంచిది. రుణదాతల ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు శుభదాయకం. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతిని దూరం చేస్తాయి.
 
కర్కాటకం: కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా వుంటుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. అయిన వారే సహాయం చేసేందుకు సందేహిస్తారు. లాటరీ వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
సింహం: రియల్ ఎస్టేట్, బ్రోకర్లకు, వ్యాపారస్తులకు పనివారితో చికాకులు తప్పవు. వ్యాపారుల ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేయాల్సి వుంటుంది. పాతమిత్రుల కలయిక ఎంతో సంతృప్తిస్తుంది. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
కన్య: బంధువులలో మంచి పేరు, ఖ్యాతిని గడిస్తారు. ధనం అధికంగా వ్యయం చేస్తారు. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. స్త్రీలు ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. పట్టుదలతో శ్రమించినా కానీ పనులు పూర్తి కావు. మీ పథకాలు, వ్యాపార వ్యవహారాలు గోప్యం వుంచాలి.
 
తుల: దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. నూతన పెట్టుబడులు, జాయింట్ వెంచర్లకు అనుకూలం. విదేశాల్లోని ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. రాబడికి మించి ఖర్చులు అధికమవుతాయి.
 
వృశ్చికం: ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. దైవసేవా కార్యక్రమాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. మీ ప్రసంగాలు శ్రోతలను ఆకట్టుకుంటాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
ధనస్సు: ఏ విషయంపైన మనస్సు లగ్నం చేయలేదు. మీ ప్రమేయం లేకున్నా మాటపడవలసి వస్తుంది. దూర ప్రయాణాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తుల వారికి గుర్తింపు, ప్రజా సంబంధాలు బలపడతాయి.
 
మకరం: పుణ్యకార్యాలకు సహాయమందిస్తారు. నిరుద్యోగులకు ఆకస్మికంగా ఒక అవకాశం కలిసివస్తుంది. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. రుణాల కోసం అన్వేషిస్తారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. భాగస్వామిక చర్చల్లో కొత్త అంశాలు చోటుచేసుకుంటాయి. 
 
కుంభం: పత్రికా సిబ్బందికి ఏకాగ్రత, పునః పరిశీలన ముఖ్యం. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొంతమొత్తం సాయం చేసి వారిని సంతృప్తిపరచండి. ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. స్త్రీల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వాహన చోదకులకు చికాకులు అధికమవుతాయి.
 
మీనం: మీ అభిప్రాయాలను సూచన ప్రాయంగా తెలియజేయండి. వ్యాపారాల అభివృద్ధికి స్కీములు, ప్రణాళికలు రూపొందిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. కుటుంబ, ఆర్థిక సమస్యలు సర్దుకుంటాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

08-03-2020 ఆదివారం మీ రాశిఫలితాలు.. సూర్యనారాయణ పారాయణతో?