Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలోకి హార్దిక్ పటేల్.. మోదీ నాయకత్వంలో చిన్న సైనికుడిగా పనిచేస్తా

Webdunia
గురువారం, 2 జూన్ 2022 (12:22 IST)
Hardik Patel
గుజరాత్‌లో కాంగ్రెస్‌కు షాకిచ్చేందు హార్దిక్ పటేల్ సిద్ధమయ్యారు. ఇటీవల హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చిన హార్దిక్ పటేల్ జూన్ 2న బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు సోమవారం రోజున ట్విటర్ వేదికగా హార్దిక్ పటేల్ ఆమ్ ఆద్మీ పార్టీపై విరుచుకుపడ్డారు. 
 
పంజాబ్‌లో సింగర్ సిధు మూసేవాలా హత్య‌కు ఆప్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. తాను బీజేపీలో చేరడం లేదని, త్వరలోనే ఇందుకు సంబంధించిన ఏదైనా అప్ డేట్ ఉంటే వెల్లడిస్తానని కూడా ఆ ట్వీట్‌లో హార్దిక్ పేర్కొన్నారు. అయితే బీజేపీ వర్గాలు మాత్రం  హార్దిక్ పటేల్ తమ పార్టీలో చేరబోతున్నారని చెబుతున్నాయి. 
 
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశానికి సేవ చేయడానికి తాను "చిన్న సైనికుడు"గా పనిచేస్తానని హార్దిక్ పటేల్ చెప్పారు. బీజేపీలో చేరేందుకు ముందు అహ్మదాబాద్‌లోని తన నివాసంలో పటేల్ పూజలు నిర్వహించారు. 
 
జాతీయప్రయోజనాలు, రాష్ట్రప్రయోజనాలు, ప్రజాప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాల భావాలతో ఈ రోజు నుంచి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను. విజయవంతమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశానికి సేవ చేసే ఉదాత్తమైన సేవలో నేను ఒక చిన్న సైనికుడిగా పనిచేస్తాను" అని పటేల్ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

తర్వాతి కథనం
Show comments