Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్ని-5 పరీక్షకు సిద్ధమైన భారత్.. పాకిస్థాన్‍కు ముచ్చెమటలు

భారత్ తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అగ్ని సిరీస్‌లో భాగంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక క్షిపణి అగ్ని-5ను పరీక్షించేందుకు సమాయత్తమవుతోంది.

Webdunia
ఆదివారం, 14 జనవరి 2018 (13:16 IST)
భారత్ తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అగ్ని సిరీస్‌లో భాగంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక క్షిపణి అగ్ని-5ను పరీక్షించేందుకు సమాయత్తమవుతోంది. ఈనెల 18, 19 తేదీల్లో ఒక రోజున దీనిని పరీక్షించేందుకు వ్యూహాత్మక దళాల కమాండ్ సన్నాహాలు చేస్తోంది. పరీక్షకు అవసరమైన అన్నింటిని దాదాపు సిద్ధం చేశారు.
 
మొత్తం 17 మీటర్ల పొడవు ఉండే అగ్ని-5 క్షిపణి 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అవలీలగా తుత్తునియలు చేయగలదు. 1.5 టన్నుల వార్‌హెడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఇది ఏక కాలంలో పలు లక్ష్యాలపై దాడి చేయగలదు. శత్రుదేశ రాడార్లకు చిక్కకుండా తన పనిని పూర్తి చేయగలదు. 
 
అగ్ని-5కు ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సత్తా ఉండడంతో పరీక్షల నిమిత్తం ఇండోనేషియా, ఆస్ట్రేలియాలను అప్రమత్తం చేయనున్నట్టు సమాచారం. మరోవైపు ఈ అగ్ని-5 పరీక్షతో పాక్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. పాక్‌ మొత్తం ఈ క్షిపణి పరిధిలోకి వస్తుండడంతో దాని వెన్నులో వణుకు మొదలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments