Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

భారత్ దెబ్బకు చైనా బెంబేలు : అరుణాచల్‌లో నిర్మాణాలు నిలిపివేత

భారత్ దెబ్బకు చైనా బెంబేలెత్తిపోయింది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో డ్రాగన్ కంట్రీ చేపట్టిన అక్రమ నిర్మాణాలను పూర్తిగా నిలిపివేసింది. ఈ విషయాన్ని బీజింగ్ అధికారికంగా ప్రకటించింది.

Advertiesment
Arunachal Pradesh
, మంగళవారం, 9 జనవరి 2018 (12:44 IST)
భారత్ దెబ్బకు చైనా బెంబేలెత్తిపోయింది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో డ్రాగన్ కంట్రీ చేపట్టిన అక్రమ నిర్మాణాలను పూర్తిగా నిలిపివేసింది. ఈ విషయాన్ని బీజింగ్ అధికారికంగా ప్రకటించింది. 
 
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఉప్పర్ సియాంగ్ జిల్లా పరిధిలోని బీసింగ్ ప్రాంతంలో తాము తలపెట్టిన రహదారి నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్టు చైనా ప్రకటించింది. తొలుత ఈ ప్రాంతం తమదని, ఇక్కడ రోడ్డు వేసే హక్కు తమకుందని వాదిస్తూ, చైనా సైన్యం నిర్మాణాలు తలపెట్టగా, యంత్ర పరికరాలన్నింటినీ భారత్ సీజ్ చేసిన సంగతి తెలిసిందే. 
 
ఆపై 6వ తేదీన రెండు దేశాల ఆర్మీ ఉన్నతాధికారులు సమావేశమై చర్చలు జరిపారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో చైనా చొరబాటును భారత్ ఏ మాత్రమూ సహకరించేది లేదని తేల్చి చెప్పారు. భారత్ ఒత్తిడితో దిగొచ్చిన చైనా, ఇక చేసేదేమీ లేక, రహదారి నిర్మాణాన్ని విరమించుకున్నట్టు పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళ లాడ్జీలో వ్యభిచారం... అమ్మాయిలు - హిజ్రాలు అరెస్టు