కేరళ లాడ్జీలో వ్యభిచారం... అమ్మాయిలు - హిజ్రాలు అరెస్టు
కేరళ రాష్ట్రంలోని ఓడరేవు పట్టణమైన కొచ్చిన్‌లో సెక్స్ రాకెట్‌ను ఆ రాష్ట్ర పోలీసులు ఛేదించారు. కొచ్చిన్ నగరంలోని ఓ లాడ్జీలో గుట్టుచప్పుడుకాకుండా సాగుతూ వచ్చింది.
కేరళ రాష్ట్రంలోని ఓడరేవు పట్టణమైన కొచ్చిన్‌లో సెక్స్ రాకెట్‌ను ఆ రాష్ట్ర పోలీసులు ఛేదించారు. కొచ్చిన్ నగరంలోని ఓ లాడ్జీలో గుట్టుచప్పుడుకాకుండా సాగుతూ వచ్చింది. దీనిపై పోలీసులకు వచ్చిన సమాచారం ఆకస్మిక సోదాలు నిర్వహించిన ఈ సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు.
ఈ కేసులో మొత్తం 14 మందిని పోలీసులు అరెస్టు చేయగా, వీరిలో ఐదుగురు మహిళలు, నలుగురు హిజ్రాలు, ముగ్గురు విటులతో పాటు లాడ్జి మేనేజర్, వ్యభిచార గృహం నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఈ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ముఠా ఆన్‌లైన్ ద్వారా విటులకు గాలం వేసి, ఫోటోలను ఆన్‌లైన్‌లో పంపి రేటు కదుర్చుకుంటారు. అనంతరం రూమ్‌తో పాటు ఇతర సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. అయితే లాడ్జీలో వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు.