Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సౌతాఫ్రికాలో చెమటోడ్చుతున్న భారత క్రికెటర్లు (వీడియో)

దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత క్రికెటర్లు చమెటోడ్చుతున్నారు. కేప్‌టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 208 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకోలేక చతికిలపడి పరువు పోగొట్టుకున్నారు.

Advertiesment
సౌతాఫ్రికాలో చెమటోడ్చుతున్న భారత క్రికెటర్లు (వీడియో)
, శుక్రవారం, 12 జనవరి 2018 (11:32 IST)
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత క్రికెటర్లు చమెటోడ్చుతున్నారు. కేప్‌టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 208 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకోలేక చతికిలపడి పరువు పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. దీంతో మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో నిలవాలంటే రెండో టెస్ట్‌లో గెలిచి తీరాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది.
 
ఇందుకోసం మైదానంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. పైగా, రెండో టెస్టను గెలిచి తీరాలన్న పట్టుదలతో వారు నెట్ ప్రాక్టీస్ చేస్తూ చెమటోడ్చుతున్నారు. మరోవైపు మూడో టెస్ట్ వరకు ఆగకుండా రెండో టెస్ట్‌లోనూ విజయభేరీ మోగించి టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో సఫారీలు ఉన్నారు. 
 
కాగా, సెంచూరియన్ వేదికగా రెండో టెస్టు జరుగనుంది. తొలి టెస్టు ఓటమి నేర్పిన గుణపాఠంతో.. రెండో టెస్టులో తప్పులు జరగకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఎండ తీవ్రత కాస్త ఎక్కువగానే ఉన్నా.. ప్రాక్టీస్ మాత్రం ఆపడం లేదు. 
 
ప్రధాన కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పర్యవేక్షణలో కాసేపు వామప్ చేసి.. ఫుట్‌బాల్ ఆడి.. తర్వాత నెట్‌ప్రాక్టీస్ చేశారు. దక్షిణాఫ్రికా జట్టును కట్టడి చేసేందుకు బ్యాటింగ్‌తో పాటు.. బౌలింగ్‌లోనూ గేమ్ ప్లాన్ వ్యూహాలు రచిస్తున్నారు. 
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విరుష్క తర్వాత పాండ్యా-ఎల్లి: సహజీవనం చేస్తున్నారట