Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హనీమూన్ హ్యాంగోవర్ అంటూ కోహ్లీపై జోకులు-కేప్‌‍టౌన్‌లో అనుష్క స్టెప్పులు

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. అలాగే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా బ్యాటింగ్‌లో రాణించలేకపోయాడు. దీంతో సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయ

Advertiesment
Virat Kohli
, ఆదివారం, 7 జనవరి 2018 (14:00 IST)
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. అలాగే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా బ్యాటింగ్‌లో రాణించలేకపోయాడు. దీంతో సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. కోహ్లీ కేవలం ఐదు పరుగులకే అవుట్ కావడంపై నెటిజన్లు ఆయనపై జోకులు పేల్చుతున్నారు.

బ్యాటింగ్ పిచ్ అయితే 200 పరుగులు చేయగల కోహ్లీ, బౌలింగ్ పిచ్‌లో 20 పరుగులు చేయలేకపోయాడని ఎద్దేవా చేస్తున్నారు. అంతేగాకుండా హనీమూన్ జరుపుకుంటున్న వ్యక్తిని ఉద్యోగానికి పిలిస్తే ఇలాగే ఉంటుందని సెటైర్లు విసురుతున్నారు.
 
దక్షిణాఫ్రికాలో జాతిపిత మహాత్మాగాంధీకే ఇబ్బందులు ఎదురయ్యారని, కోహ్లీ ఎంతని కామెంట్లు పోస్టు చేస్తున్నారు. హనీమూన్ హ్యాంగోవర్ నుంచి బయట పడేందుకు కోహ్లీకి మరో 15 ఇన్నింగ్స్‌లు పడుతుందని నెటిజన్లు జోకులేస్తున్నారు. ఈ జోకులు, సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
మరోవైపు విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ దక్షిణాఫ్రికాలో ఎంజాయ్ చేస్తోంది. భర్త వెంట వెళ్లిన అనుష్క.. జీవిత భాగస్వాములతో సహా వెళ్లిన భారత క్రికెటర్ల భార్యలందరికీ గ్యాంగ్ లీడర్ అయిపోయింది. వీరంతా మైదానంలో ఒక చోట చేరి సందడి చేస్తున్నారు. 
 
ధావన్ భార్య ఆయేషా, భువనేశ్వర్ కుమార్ భార్య నుపుర్, రోహిత్ శర్మ భార్య రితిక.. కోహ్లీ భార్య అనుష్క శర్మలు కలిసి.. కేప్‌టౌన్‌లో చేసే హంగామా అంతా ఇంతా కాదు.  కలసి షాపింగులు చేస్తూ.. మైదానంలో టీమిండియా ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తూ కనిపిస్తున్నారు. వీరిలో విరాట్ సతీమణి ఒకడుగు ముందుకేసి.. కేప్‌టౌన్‌లో స్టెప్పులేసింది. అనుష్క శ‌ర్మ డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూడొచ్చు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీలంక మాజీ కెప్టెన్ జయసూర్యను చూస్తే అయ్యోపాపం అంటారు?