Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షారూఖ్ ఖాన్ "జీరో" ట్రైలర్

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కొత్త సినిమా ''జీరో''. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో షారూఖ్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో కనిపిస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో షారూఖ్ ఖా

Advertiesment
షారూఖ్ ఖాన్
, మంగళవారం, 2 జనవరి 2018 (15:47 IST)
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కొత్త సినిమా ''జీరో''. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో షారూఖ్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో కనిపిస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ సరసన అనుష్క శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2018, డిసెంబ‌ర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. 
 
గతంలో షారూఖ్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ 'జ‌బ్ త‌క్ హై జాన్' సినిమాలో కలిసి న‌టించారు. ఈ చిత్రానికి షారుక్ భార్య గౌరీ ఖాన్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ టీజర్‌లో మరుగుజ్జు పాత్రలో షారూఖ్ ఖాన్ డ్యాన్స్ అదుర్స్ అనిపించింది. మొహమ్మద్ రఫీ క్లాసికల్ ట్రాక్‌లో సాగిన పాటకు సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన షారూఖ్ డ్యాన్స్‌తో అదరగొట్టేశాడు. ఈ టీజర్‌ను ఓ లుక్కేయండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గజల్ శ్రీనివాస్‌కు ఈ నెల 12వరకు జ్యుడిషియల్ రిమాండ్