Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హీరోలకు 15 యేళ్ళ కుర్రపిల్ల కావాలి.. కానీ, కూతుళ్లు బికినీలు వేయకూడదు

నిత్యం ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో మీడియాకెక్కే కంగనా రనౌత్ ఇపుడు బాలీవుడ్ 'బాద్‌షా' షారూక్ ఖాన్‌ను టార్గెట్ చేసింది. వయసు మీదపడుతున్న.. సినిమాల్లో గంతులేయడానికి 15 యేళ్ళ కుర్రపిల్ల కావాలనీ, తమ కూతుళ్ళు బ

Advertiesment
హీరోలకు 15 యేళ్ళ కుర్రపిల్ల కావాలి.. కానీ, కూతుళ్లు బికినీలు వేయకూడదు
, మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (15:04 IST)
నిత్యం ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో మీడియాకెక్కే కంగనా రనౌత్ ఇపుడు బాలీవుడ్ 'బాద్‌షా' షారూక్ ఖాన్‌ను టార్గెట్ చేసింది. వయసు మీదపడుతున్న.. సినిమాల్లో గంతులేయడానికి 15 యేళ్ళ కుర్రపిల్ల కావాలనీ, తమ కూతుళ్ళు బికినీలు వేస్తే కాళ్ళు విరగ్గొడతామని వార్నింగులు ఇస్తుంటారని పరోక్షంగా షారూఖ్‌ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసింది. 
 
అంతేకాకుండా, తమ కొడుకులను హీరోలుగా నిలబెట్టడానికి పడరాని పాట్లు పడుతుంటారు కానీ కూతుళ్ళను హీరోయిన్లుగా చేయాలంటే పదిసార్లు ఆలోచిస్తారనీ, అయితే అందరూ హీరోలు అలా లేరని ముక్తాయింపు ఇచ్చింది. ఏమైనా ఈ సారి ఒకరినో ఇద్దరినో కాకుండా మొత్తం హీరోలందరినీ టార్గెట్‌ చేయడం ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. 
 
కాగా, ఇటీవల బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలిపై కంగనా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఇటీవల 'ఆప్ కా అదాలత్' అనే టీవీ షోలో పాల్గొన్న కంగనా.. ఆదిత్య పంచోలి, హృతిక్ రోషన్‌‌‌‌‌‌లపై తనకున్న వైరం గురించి ప్రస్తావిస్తూ.."ఆదిత్య పంచోలి తనను చిన్నప్పుడు దారుణంగా కొట్టేవాడని చెప్పింది. ఆదిత్య కుమార్తె నాకంటే ఏడాది చిన్నది. నాకు 17 ఏళ్ళ వయసున్నపుడు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. 
 
ఈ విషయంలో ఆదిత్య నన్ను రక్తం చిందించేలా చితకబాదాడు. ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక అతని భార్యకు చెబితే.. ఆయన ఇంటికి రావడం లేదని, అందువల్ల తాను హాయిగా జీవిస్తున్నాని చెప్పడంతో అవాక్కయ్యాను. పోనీ పోలీస్ కంప్లైంట్ చేద్దామనుకుంటే తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారని ఆగిపోయాను" అంటూ వాపోయింది. దీనిపై బాలీవుడ్‌లో తీవ చర్చ జరిగిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'బుల్లి మెగాస్టార్'ను చూడాలనుంది... 20 ఏళ్ల ప్రాజెక్ట్ అంటున్న ఉపాసన