Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షారూఖ్‌పై కంగనా ఫైర్.. 15ఏళ్ల అమ్మాయిలతో చిందులేస్తారు.. ఆదిత్య నోటీసులు..

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం షారూఖ్ ఖాన్‌పై పడింది. కంగనా వ్యాఖ్యలు ప్రస్తుతం బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారాయి. అనునిత్యం ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ.. విమర్శలు గుప్పిస్తూ న్యూస్ హెడ్ లైన్స్‌

Advertiesment
షారూఖ్‌పై కంగనా ఫైర్.. 15ఏళ్ల అమ్మాయిలతో చిందులేస్తారు.. ఆదిత్య నోటీసులు..
, మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (12:27 IST)
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం షారూఖ్ ఖాన్‌పై పడింది. కంగనా వ్యాఖ్యలు ప్రస్తుతం బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారాయి. అనునిత్యం ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ.. విమర్శలు గుప్పిస్తూ న్యూస్ హెడ్ లైన్స్‌లో నిలుస్తోంది. 
 
తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను టార్గెట్ చేసింది. పరోక్షంగా అతనిపై తీవ్ర విమర్శలు గుప్పించింది. హీరోలంతా 15 ఏళ్ల అమ్మాయిలతో చిందులేస్తుంటారని దెప్పిపొడిచింది. కానీ, వారి అమ్మాయిల విషయానికి వచ్చేసరికి కఠినంగా వ్యవహరిస్తుంటారని కంగనా విమర్శిచింది. 
 
బికినీలు వేస్తే కాళ్లు విరగ్గొడతానంటూ వార్నింగ్‌లు ఇస్తుంటారని షారూఖ్ ఖాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేసింది. బాలీవుడ్ టాప్ హీరోలు తమ కూతుళ్లను హీరోయిన్లను చేసే విషయంలో పదిసార్లు ఆలోచిస్తారని ఫైర్ అయ్యింది. కానీ అందరు హీరోలూ ఇలా వుండరని చెప్పుకొచ్చింది. కాగా కంగనా వ్యాఖ్యలపై  మండిపడింది. అయితే, అందరు హీరోలు ఇలాగే ఉండరని కూడా చెప్పింది.
 
కాగా, బాలీవుడ్ సినిమా రంగంలో పురుషాధిక్యత ఎక్కువని, హీరోయిన్లను చిన్నచూపు చూస్తారని పదే పదే మొత్తుకుంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఏమాత్రం వెనుకాడని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, తాజాగా ఆ సినీ రంగంలో ఉన్న లోటుపాట్లపై పాట ద్వారా సెటైర్లు విసిరింది.
 
ఇటీవ‌ల ''ఆప్ కీ అదాల‌త్‌'' కార్య‌క్ర‌మంలో బాలీవుడ్ గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన కంగనా రనౌత్.. హిందీ సినిమాల విధివిధానాల గురించి తెలియజేసే ఓ మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. ఆదిత్య పంచోలీ త‌నని తీవ్రంగా హింసించే వాడని, అపుడు తాను మైనర్ కావ‌డం వ‌ల‌న‌, ఏం చేయాలో అర్థం అయ్యేది కాదని తెలిపింది. 2016లో రేగిన 'సిల్లీ ఎక్స్' వివాదంలో హృతిక్‌కి మ‌ద్ద‌తు తెలిపిన పంచోలి చాలా డేంజ‌ర్ అని కంగ‌నా తెలిపింది. 17 ఏళ్ళ వ‌య‌స్సులో తాను ఇండ‌స్ట్రీకి వ‌చ్చాన‌ని చెబుతూ, ఆదిత్య పంచోలి కుమార్తె కంటే త‌ను ఏడాది చిన్న‌ద‌నే విష‌యాన్ని వెల్ల‌డించింది.
 
ఇక సినిమా షూటింగ్‌లో పాల్గొన్న‌ప్పుడు ఆదిత్య త‌న‌ని ర‌క్తం వచ్చేలా కొట్టాడని, ఈ విష‌యాన్ని త‌న భార్య జ‌రీనా వాహ‌బ్‌కి చెబితే తాను ఏ స‌హాయం చేయ‌క సైలెంట్‌గా ఉండేదంటూ కొన్ని సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించింది. దీనిపై ఆదిత్య పంచోలి సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యాడు.
 
కంగ‌నా ర‌నౌత్‌కి పిచ్చి ప‌ట్టింది. ఇంట‌ర్వ్యూలో పిచ్చోళ్ళు మాట్లాడిన‌ట్టే మాట్లాడింది. కంగనా ఇలాంటి మాట‌లు మాట్లాడ‌డంపై త‌ప్పక లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకుంటానని చెప్పాడు. చెప్పినట్లే.. కంగనాకు నోటీసులు పంపాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాత పేరు కలిసిరాలేదంటున్న 'జయం' హీరోయిన్