Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాత పేరు కలిసిరాలేదంటున్న 'జయం' హీరోయిన్

నితిన్ హీరోగా వచ్చిన చిత్రం 'జయం'. ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ సద. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో సదాకు మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలో ఈ మరాఠీ భామకు దర్శక దిగ్గజం ఎ

Advertiesment
పాత పేరు కలిసిరాలేదంటున్న 'జయం' హీరోయిన్
, మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (12:23 IST)
నితిన్ హీరోగా వచ్చిన చిత్రం 'జయం'. ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ సద. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో సదాకు మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలో ఈ మరాఠీ భామకు దర్శక దిగ్గజం ఎస్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన "అపరిచితుడు" చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత 'నాగ', 'చుక్కల్లో చంద్రుడు', 'ఔనన్నా కాదన్నా' వంటి సినిమాల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం టీవీ రియాలిటీ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న సదా తన పేరును మార్చుకుందట.
 
సిల్కర్‌స్క్రీన్‌పై మరోసారి మెరువాలని భావించిన సదా ఇటీవల ఓ న్యూమరాలజిస్ట్‌ను సంప్రదించిందట. న్యూమరాలజిస్ట్ సూచన ప్రకారం తన పేరును సదా సయ్యద్‌గా మార్చుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ హీరోయిన్ కొత్త పేరుతో కెరీర్‌లో మరింత సక్సెస్‌ను అందుకోవాలని మనమూ విష్ చేద్దాం. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని ఓ ముస్లిం కుటుంబంలో సదా జన్మించింది. సదా తండ్రి డాక్టర్ కాగా.. తల్లి బ్యాంకు ఉద్యోగి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాలో బాహుబలి-2 రిలీజ్: హాలీవుడ్ సినిమాలతో పోటీపడుతుందా?