ఢిల్లీలో హనీప్రీత్ సింగ్: ముందస్తు బెయిల్ కోసం పిటిషన్...
డేరాబాబా కేసులో కీలక నిందితురాలు హనీప్రీత్ నేపాల్‌లో లేదని తేలిపోయింది. అంతేగాకుండా హనీప్రీత్ సింగ్ ఢిల్లీలోనే మకాం వేసినట్లు సమాచారం. సాధ్వీలపై అత్యాచారం కేసుల్లో డేరాబాబాకు జైలుశిక్ష పడిన అనంతరం కనప
డేరాబాబా కేసులో కీలక నిందితురాలు హనీప్రీత్ నేపాల్‌లో లేదని తేలిపోయింది. అంతేగాకుండా హనీప్రీత్ సింగ్ ఢిల్లీలోనే మకాం వేసినట్లు సమాచారం. సాధ్వీలపై అత్యాచారం కేసుల్లో డేరాబాబాకు జైలుశిక్ష పడిన అనంతరం కనపడకుండా పోయిన హనీప్రీత్ సింగ్ కోసం హర్యానా సిట్ అధికారులు దేశ వ్యాప్తంగా గాలిస్తున్నారు. బీహార్‌లో ఆమె కనిపించినట్లు అధికారులు చెప్తున్నారు.
అంతేగాకుండా ముందస్తు బెయిల్ దరఖాస్తుపై సంతకం చేసేందుకు సోమవారం హనీప్రీత్ సింగ్ తన కార్యాలయానికి వచ్చినట్టు ఆమె న్యాయవాది ప్రదీప్ ఆర్య వెల్లడించారు. హనీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మంగళవారం ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానున్నట్టు ఆయన తెలిపారు.
హనీప్రీత్ సింగ్ తనతో మాట్లాడుతున్నారని.. ఆమె ఎక్కడున్నారనే విషయం మాత్రం తనకు తెలియదన్నారు. తన క్లయింట్ ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్టు ఆర్య పేర్కొన్నారు. డేరా బాబాతో ఆమెకు అక్రమసంబంధాలను నెలకొల్పడం సరికాదని ఆర్య అన్నారు.