Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'రూబరూ' పేరుతో నైట్ పార్టీలు... డబుల్ మీనింగ్ మాటలతో మహిళలకు గుర్మీత్ వల

డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆయన రాసక్రీడలకు సంబంధించి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో విషయం తెలి

Advertiesment
'రూబరూ' పేరుతో నైట్ పార్టీలు... డబుల్ మీనింగ్ మాటలతో మహిళలకు గుర్మీత్ వల
, శనివారం, 16 సెప్టెంబరు 2017 (09:29 IST)
డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆయన రాసక్రీడలకు సంబంధించి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో విషయం తెలిసింది. కేవలం సంపన్న వర్గాలకు చెందిన మహిళలకు వల వేసేందుకు గర్మీత్ సింగ్ తన దత్తపుత్రిక హనీప్రీత్‌ను పావుగా వాడుకున్నట్టు తెలుస్తోంది. 
 
ఓ ఫేస్‌బుక్ స్క్రీన్ షాట్ ఆధారంగా పోలీసులు ఆరాతీస్తే.. గుర్మీత్ బాబా మరో అకృత్యం బయటకు వచ్చింది. గుర్మీత్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ 'రూబరూ' పేరిట నైట్ పార్టీలను ఏర్పాటు చేసేదట. ఈ పార్టీలకు కేవలం ఉన్నత వర్గాలకు చెందిన మహిళలను మాత్రమే ఆహ్వానించేదట. ఈ పార్టీల్లో పాల్గొనేందుకు ఒక్కో మహిళ నుంచి రూ.15 వేలను ప్రవేశ రుసుంగా వసూలు చేసేవారట. 
 
ఈ మహిళా లేట్ నైట్ పార్టీల్లో పాల్గొనే ఏకైక పురుషుడు గుర్మీత్ మాత్రమే. ఈ పార్టీలో పాల్గొనే మహిళలను సాధ్వీలను ఏజంట్లుగా చేసుకుని ఎంపిక చేసేదట.ఈ పార్టీలకు ఆకర్షణీయమైన దుస్తులు, విచిత్రమైన వేషధారణతో వచ్చే గుర్మీత్, డబుల్ మీనింగ్ డైలాగులు చెబుతూ, పాటలు పాడుతూ మహిళలను ఆకర్షించి, వారితో నృత్యాలు చేయించేవాడట. 
 
ఆ మహిళల్లో తనకు నచ్చిన వారిని వలలో వేసుకుని, ఎంజాయ్ చేస్తూ వచ్చినట్టు సమాచారం. ఇలాంటి బాధితుల్లో అనేక మంది సంపన్న కుటుంబాలకు చెందిన మహిళలు ఉన్నట్టు వినికిడి. ఇందుకు హనీప్రీత్‌తో పాటు సాధ్వీలు తమవంతు సహకారాన్ని అందించేవారని అధికారులు వెల్లడించారు. డేరాలో ఈ తరహా పార్టీలు ఎన్నో జరిగాయని, ఫలితంగా అనేక మంది మహిళలు డేరా బాబా చేతిలో మోసపోయినట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లష్కర్ చీఫ్‌గా కాశ్మీర్ ఉగ్రవాది? అదే జరిగితే తొలి కాశ్మీరీగా రికార్డు