Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త నాకొద్దు, చంపేద్దామంటూ ప్రియుడిని ఉసిగొల్పిన భార్య

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (23:04 IST)
తమిళనాడు రాష్ట్రం హోసూరు ప్రాంతమది. సరిగ్గా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న ప్రాంతమే హోసూరు. ఈ ప్రాంతంలోని ఎర్రమిట్టలో నివాసముండే ధనపాల్, సత్యలకు 18 నెలల క్రితం వివాహమైంది. ఇంకా పిల్లలు లేరు. 
 
ధనపాల్ ప్రాణస్నేహితుడు మణికంఠన్. ధనపాల్, మణికంఠన్ ఇద్దరు కూడా మేస్త్రీ పనిచేసేవారే. చిన్పప్పటి నుంచి ఇద్దరూ కలిసి చదువుకోవడం.. తిరగడం చేసేవారు. కాబట్టి ఒకరంటే ఒకరికి నమ్మకం. అలా ప్రతిరోజు స్నేహితుడి ఇంటికి వెళ్లేవాడు మణికంఠన్. మణికంఠన్ తరచూ ఇంటికి రావడంతో సత్య అతడి పట్ల ఆకర్షితురాలైంది. ఆమెను చూసిన మణికంఠన్ ఎలాగైనా ఆమెతో గడపాలనుకున్నాడు. స్నేహితుడి భార్య కదా అని కొన్నిరోజులు ఊరుకున్నాడు.
 
కానీ సత్య మాత్రం వెనక్కి తగ్గలేదు. మణికంఠన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవాలనుకుంది. అతన్ని ముగ్గులోకి దింపింది. స్నేహితుడికి అన్యాయం చేయకూడదని ముందుగా భావించినా సత్య ఒత్తిడి చేయడంతో ఇక మణికంఠన్ కూడా రంగంలోకి దిగాడు.
 
ఇలా రెండునెలల పాటు వీరి బాగోతం సాగింది. స్నేహితుడు ధనపాల్‌కు ఎలాంటి అనుమానం రానివ్వలేదు. కానీ ఇరుగుపొరుగు వారు ఇచ్చిన సమాచారంతో చివరకు మేల్కొన్నాడు ధనపాల్. తన స్నేహితుడు, భార్య ఇద్దరూ కలిసి ఉండటాన్ని కళ్ళారా చూసి రోడ్డుపైకి తీసుకొచ్చాడు. పంచాయతీ పెట్టాడు. పెద్దలు వార్నింగ్ ఇచ్చి పంపించారు.
 
కానీ సత్య భర్తను వద్దనుకుంది. మణికంఠన్ తోనే ఉండిపోవాలనుకుంది. దీంతో భర్తను రెండు రోజుల క్రితం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిమి చంపేశారు. ఆ తరువాత ఉరి వేసుకున్నట్లు ఫ్యాన్‌కు ఉరితీసి పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ బంధువుల ఫిర్యాదుతో అసలు విషయం బయటపడి చివరకు నిందితులు కటాకటాల పాలయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments