Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుమానం పెనుభూతమైంది... చచ్చిపొమ్మన్న హేమనాథ్.. ప్రాణం తీసుకున్న చిత్ర! (video)

Advertiesment
అనుమానం పెనుభూతమైంది... చచ్చిపొమ్మన్న హేమనాథ్.. ప్రాణం తీసుకున్న చిత్ర! (video)
, బుధవారం, 16 డిశెంబరు 2020 (13:08 IST)
తమిళ బుల్లితెర నటి చిత్ర ఆత్మహత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఆమె కాబోయే భర్తే హేమనాథే ప్రధాన సూత్రధారి అని తేలింది. తనతో నిశ్చితార్థం చేసుకుని, పరాయి పురుషులతో కలిసి టీవీ సీరియల్స్ కోసం బెడ్‌రూమ్ సన్నివేశాల్లో నటించడాన్ని జీర్ణించుకోలేకోపోయాడు. అంతే.. రహస్యంగా రిజిస్టర్ పెళ్లి చేసుకున్న చిత్రతో గొడవపడ్డాడు. చివరకు చచ్చిపో అంటూ బిగ్గరగా అరిచాడు. అతని మాటలతో తీవ్ర మనస్తాపం చెందిన చిత్ర చివరకు ప్రాణాలు తీసుకుంది. 
 
తమిళ బుల్లితెర నటి చిత్ర ఆత్మహత్య కేసులో ప్రధాన సూత్రధారి ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్న హేమనాథేనని తేలింది. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన వద్ద జరిపిన విచారణలో అనేక విషయాలు వెలుగులోకివచ్చాయి. 
 
కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్‌ కాలంలో రియల్‌ వ్యాపారి హేమనాథ్, చిత్ర ప్రేమలో పడ్డారు. లాక్డౌన్ ఆంక్షలు సడలించిన అనంతరం ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. అనంతరం చిత్రపై హేమనాథ్‌కు అనుమానం ప్రారంభమైంది. అయినప్పటికీ హేమనాథ్‌ ఒత్తిడితో చిత్ర రిజిస్టర్‌ మ్యారేజ్‌కు అంగీకరించింది. చిత్ర షూటింగుల్లో బిజీగా ఉంటుండడం ఆయనకు నచ్చలేదు.
 
ఈ క్రమంలో ఓ రోజు అర్థరాత్రి షూటింగ్‌ స్పాట్‌కు వచ్చి చిత్రను ఇంటికి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో వారిద్దరు కారులోనే గొడవపడ్డారు. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లారు. అక్కడ కూడా గొడవ పడగా, చచ్చిపొమ్మంటూ చిత్రకు హేమనాథ్ కోపగించుకున్నాడు. దీంతో చిత్ర ఆవేశంలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. ప్రస్తుతం హేమనాథ్ పొన్నేరి జైలులో రిమాండులో ఉన్నాడు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లిని వాయిదా వేసుకున్న సింగర్ సునీత.. ఎందుకంటే? (Video)