పిల్లలు పుట్టలేదని పరాయి స్త్రీతో పడక సుఖం పొందుతున్న కట్టుకున్న భర్తను భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ తర్వాత అతనితోపాటు.. పరాయి స్త్రీ చితక్కొట్టింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వనస్థలిపురంలోని శక్తినగర్‌లో నివాసముంటున్న కరీంనగర్ జిల్లాకు చెందిన పద్మకు, చింతల్‌కుంటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తితో పదేళ్ళ క్రితం వివాహమైంది.
పద్మకు సంతానం లేకపోవడంతో భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పైగా, పద్మను పట్టించుకోవడం మానేశాడు. ఈ విషయం తెలుసుకున్న పద్మ తన తండ్రితో కలిసి భర్త శ్రీనివాస్ ఉంటున్న ఆ మహిళ ఇంటికి వెళ్లింది. అంతటితో ఆగకుండా భర్త శ్రీనివాస్‌ను తీవ్రంగా కొట్టింది. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.