Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడి ప్రేయసిని నమ్మించి రేప్... రెండేళ్ల తర్వాత తీర్పు...

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (15:20 IST)
ఫ్రెండ్ లవర్‌ను నమ్మించి ఆమెపై అత్యాచారం చేసిన ఘటన తమిళనాడు కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన రెండేళ్ల క్రితం జరిగింది. ఇందుకు సంబంధించిన విచారణ రెండేళ్ల పాటు సాగింది. నిందితుడికి కోర్టు 20 ఏళ్లపాటు జైలు శిక్షను ఖరారు చేసింది.
 
కడలూరులోని పెరియకోటమూలై ప్రాంతానికి చెందిన సత్యమూర్తి, విజయేంద్రన్ స్నేహితులు. అయితే విజయేంద్రన్ ప్రియురాలిపై సత్యమూర్తి ఎప్పటినుంచో కన్నేశాడు. అందుకు ఒక పథకాన్ని రచించాడు. 2017 మార్చి 17న సత్యమూర్తి యువతికి ఫోన్ చేసి విజయేంద్రన్‌కి యాక్సిడెంట్ అయిందని, కోయంబత్తూర్ హాస్పిటల్‌లో చేర్చినట్లు అలాగే అతడి కండీషన్ సీరియస్‌గా ఉందని చెప్పి ఆమెను బైక్‌పై తీసుకెళ్లాడు. అతని మాయమాటలు వినిన యువతి బైక్‌పై వెళ్లింది. 
 
నిర్మానుష్య ప్రాంతానికి యువతిని తీసుకెళ్లిన సత్యమూర్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడి నుండి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన అప్పట్లో స్థానికంగా సంచలనం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. 
 
ఈ సంఘటనపై విచారణ జరిపిన కడలూరు విమెన్ కోర్టు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితుడికి రెండేళ్ల తర్వాత శిక్షపడడంతో తగు న్యాయం జరిగిందంటూ పలువురు ఆనందం వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments