Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జునాగఢ్‌లో మరో దొంగబాబా... మహిళపై లైంగికదాడి

Advertiesment
జునాగఢ్‌లో మరో దొంగబాబా... మహిళపై లైంగికదాడి
, బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (10:57 IST)
అనేకమంది దొంగ బాబాల చేతిలో మోసపోతున్నారు. అయినప్పటికీ ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ఇలాంటి దొంగ బాబాలను నమ్మి మోసపోయేవాళ్లు సమాజంలో ఏదో ఒక మూల పెరుగుతూనే పోతున్నారు... అలాంటి సంఘటనే జునాగఢ్‌లో తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాలలోకి వెళ్తే... సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే.. పెద్ద వాళ్లో... లేకపోతే... లాయర్లో తీర్చడమో అలా కుదరలేదంటే... విడాకులు తీసుకోవడమో చూస్తూనే ఉంటాము... కానీ జునాగఢ్‌లోని ఓ మహిళ తనను తన భర్తతో కలిపేందుకు ఒక స్వామిగారిని కలిసింది.. పర్యవసానంగా ఆవిడ జీవితం బలయింది... 
 
గుజరాత్‌లోని జూనాగఢ్‌కు చెందిన ఒక మహిళ...  భర్త నుంచి విడిపోయి ఉంటున్నారు. అయితే ఆమె తనకు, తన భర్తకు మధ్య నడుస్తున్న వివాదాన్ని తీర్చి, తమను కలిపేందుకుగానూ స్వామీ ఆనంద్ స్వరూపాదాస్ ద్వారా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో స్వామీజీతో వాట్సాప్ చాటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల స్వామీజీ తనను కారులో తీసుకువెళ్లి శిశుమంగళ్ రోడ్డు సమీపంలో తనపై లైంగిక దాడి చేశారనీ, దానికి డ్రైవర్ కూడా స్వామీజీకి సహకరించాడనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఆమె తన ఫిర్యాదులో స్వామీజీ తనకు కత్తి చూపించి, కారులో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. అలాగే ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తన కుమార్తెను తీసుకు వెళ్లిపోతామని హెచ్చరించారని పేర్కొన్నారు. తర్వాత తనను చంపేస్తామని బెదిరించి, రోడ్డుమీద వదిలేసి వెళ్లిపోయారని ఆమె పేర్కొన్నారు. కాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వామీ ఆనంద్ స్వరూప్‌దాస్‌తో పాటు అతని అనుచరుణ్ణి పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్జికల్ స్ట్రైక్ : సోషల్ మీడియాలో ప్రచారం... ఆర్మీ వినతి