Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకప్పుడు రేమాండ్ కోటీశ్వరుడాయన... కొడుకు దెబ్బకు 'బిచ్చగాడి'లా...

మనిషిని నమ్మితే ఏముందిరా.... చెట్టును నమ్మినా ఫలితముందిరా అని ఓ కవి చెప్పినట్లు కన్న కొడుకులే తల్లిదండ్రులను పట్టించుకోకుండా వృద్ధాశ్రమాలకో, లేదంటే ఏ ఆసుపత్రులలోనో వదిలేసి వెళ్లిపోతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. ఇలాంటి ఘటనే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (14:23 IST)
మనిషిని నమ్మితే ఏముందిరా.... చెట్టును నమ్మినా ఫలితముందిరా అని ఓ కవి చెప్పినట్లు కన్న కొడుకులే తల్లిదండ్రులను పట్టించుకోకుండా వృద్ధాశ్రమాలకో, లేదంటే ఏ ఆసుపత్రులలోనో వదిలేసి వెళ్లిపోతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. ఇలాంటి ఘటనే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వస్త్ర పరిశ్రమలో ఒకప్పుడు రారాజుగా వెలిగిన రేమాండ్స్ వ్యవస్థాపకుడు విజయ్ పథ్ సింఘాని ఇప్పుడు వీధినపడ్డారు. 
 
చేతిలో చిల్లిగవ్వ లేక అద్దె ఇంట్లో నానా అవస్థలు పడుతున్నారు. 78 ఏళ్ల వయసులో ఆయన పడుతున్న ఈ కష్టాన్ని చూసి ఇరుగుపొరుగు వారు ఆవేదన చెందుతున్నారు. కోట్ల రూపాయల వ్యాపారంతో తులతూగే విజయ్ పథ్ సింఘానియాకు ఈ కష్టాన్ని తెచ్చిపెట్టింది కూడా ఆయన పుత్రరత్నమే. వ్యాపారాన్నంతా కైవసం చేసుకుని తండ్రిని వీధిన పడేశాడు. ఆయన కుమారుడు గౌతమ్ సింఘానియా తండ్రి కనీస అవసరాలను తీర్చేందుకు కూడా డబ్బు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారట. 
 
తనకు రావాల్సిన ఆస్తి, డబ్బును ఇప్పించండి మహా ప్రభో అంటూ ఇప్పుడు రేమండ్ దిగ్గజం విజయ్ పథ్ సింఘానియా కోర్టు మెట్లెక్కారు. ఏం చేస్తాం... కలికాలం. కన్నబిడ్డలే కాటికి పంపే దారుణ స్థితి. మరోవైరు విజయ్ పథ్ సింఘానియా పిటీషన్ పైన స్పందించిన కోర్టు రేమాండ్ సంస్థకు నోటీసులు పంపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఓజీ మొదటి గీతం ఫైర్‌ స్టార్మ్ వచ్చేసింది

నన్ను ఎవరూ నమ్మని రోజు ఎస్.కేఎన్ నమ్మాడు : బేబి డైరెక్టర్ సాయి రాజేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments