Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడి కోసం రూ.వేల కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు.. ఎక్కడ?

గతంలో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "సన్నాఫ్ సత్యమూర్తి".. విలువలే ఆస్తి అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చింది. ఈ చిత్రంలో హీరో ఆస్తి కంటే విలువలే గొప్పవని చెపుతూ.. తన తండ్రి గౌరవమర

Advertiesment
ప్రియుడి కోసం రూ.వేల కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు.. ఎక్కడ?
, శనివారం, 5 ఆగస్టు 2017 (11:34 IST)
గతంలో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "సన్నాఫ్ సత్యమూర్తి".. విలువలే ఆస్తి అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చింది. ఈ చిత్రంలో హీరో ఆస్తి కంటే విలువలే గొప్పవని చెపుతూ.. తన తండ్రి గౌరవమర్యాదలను కాపాడేందుకు రూ.300 కోట్ల ఆస్తిని తృణప్రాయంగా వదులుకుంటాడు. ఇది సినిమాలో జరిగిన కథ. కానీ, వాస్తవిక జీవితంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. తన ప్రియుడి కోసం రూ.వేల కోట్ల ఆస్తిని ఆ ప్రియురాలు వదులుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మలేసియాలో ఖూకే పెంగ్ బిజినెస్ టైకూన్. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత. ఆయన భార్య మాజీ మిస్ మలేసియా పౌలిన్ ఛై. ఆ దంపతులకు ఐదుగురు సంతానం. వారిలో చిన్న కుమార్తె పేరు ఏంజెలినా ఫ్రాన్సిన్ ఖూ. ఈమె జెడిడియా అనే ఫ్యాషన్ డిజైనర్‌‌ను ప్రేమించింది. వారి వివాహానికి తల్లి అంగీకారం తెలిపినా, తండ్రి మాత్రం వ్యతిరేకించారు. అతడిని పెళ్ళి చేసుకుంటే ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వనని తెగేసి చెప్పాడు. 
 
అయితే, తనకు ఆస్తి కంటే ప్రియుడే ముఖ్యమని ఆ యువతి తేల్చి చెప్పి వివాహం చేసుకుంది. ఈ వివాహానికి కేవలం 30 మంది మాత్రమే హాజరయ్యారు. ఆమె తరపువారెవరూ హాజరుకాకపోవడం విశేషం. ఆమె జీవితం హాయిగా సాగిపోతుండగా, తన తల్లిదండ్రుల మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో వారు కోర్టు కెక్కారు. దీంతో న్యాయస్థానం విడాకులు మంజూరు చేసిన సందర్భంగా ఆస్తుల వాటాలు కోరింది. దీంతో ఏంజెలినాకు కూడా వాటాగా వేల కోట్ల రూపాయలు వచ్చాయి. వీరి ప్రేమకథ ఈమధ్యే వెల్లడికాగా, వారి ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. వారి ప్రేమ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళల జుట్టు కత్తిరిస్తున్న ఆ అదృశ్యశక్తి ఎవరు?