Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిస్కెట్ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు

యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లాలోని మదన్‌పురాలో చోటుచేసుకున్న బాలుడి ఆత్మహత్య అందరిలోనూ కలకలం రేపింది.

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (19:14 IST)
యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లాలోని మదన్‌పురాలో చోటుచేసుకున్న బాలుడి ఆత్మహత్య అందరిలోనూ కలకలం రేపింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం తల్లి తన కుమారునికి బిస్కెట్ కొనుక్కోవడానికి 2 రూపాయలు ఇవ్వలేదని కోపగించుకున్న ఆ బాలుడు పాఠశాలకు వెళ్లేటప్పుడు తన తల్లి చున్నీని తీసుకుని వెళ్లాడు. ఆ చున్నీతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
విషయం తెలుసుకున్న పోలీసులు... ఆత్మహత్య చేసుకున్న బాలుడిని చంద్రభాన్‌గా గుర్తించారు. అయితే చంద్రభాన్ స్కూల్‌కి బయలుదేరే ముందు తల్లి అతడికి టీ ఇచ్చి బిస్కెట్ ఇవ్వలేదని, అందువలన బిస్కెట్ కోసం 2 రూపాయలు ఇవ్వాల్సిందేనని మొండికేశాడు. చివరకు ఆమె చంద్రభాన్‌ను కొట్టడంతో ఆమె చున్నీ తీసుకుని స్కూలుకు బయలుదేరాడు. ఇక సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. 
 
గ్రామ సమీపంలో ఉన్న పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో చంద్రభాన్ గ్రామస్తులకు కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి పంపించి, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments