Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాది టెన్త్ క్లాస్ ప్రేమ... అయిష్టంగా భర్తతో కాపురం చేస్తున్నా.. ప్రియుడే ముఖ్యమంటూ సూసైడ్

మాది టెన్త్ క్లాస్ ప్రేమ. నాకు ఇష్టంలేని పెళ్లి చేశారు. ఎనిమిదేళ్లుగా అయిష్టంగానే భర్తతో కాపురం చేస్తున్నాను. ఇద్దరు పిల్లలకు తల్లిని అయ్యాను. కానీ, చిన్ననాటి ప్రేమికుడుని మాత్రం, అతని జ్ఞాపకాలను మరిచ

Advertiesment
మాది టెన్త్ క్లాస్ ప్రేమ... అయిష్టంగా భర్తతో కాపురం చేస్తున్నా.. ప్రియుడే ముఖ్యమంటూ సూసైడ్
, బుధవారం, 3 అక్టోబరు 2018 (17:23 IST)
మాది టెన్త్ క్లాస్ ప్రేమ. నాకు ఇష్టంలేని పెళ్లి చేశారు. ఎనిమిదేళ్లుగా అయిష్టంగానే భర్తతో కాపురం చేస్తున్నాను. ఇద్దరు పిల్లలకు తల్లిని అయ్యాను. కానీ, చిన్ననాటి ప్రేమికుడుని మాత్రం, అతని జ్ఞాపకాలను మరిచిపోలేక పోతున్నా. అందుకే అతనితో కలిసి ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నానంటూ ఓ వివాహిత సూసైడ్ నోట్ రాసిపెట్టి తన చిన్ననాటి ప్రియుడుతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ సన్నిధిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బూడిదగడ్డ బస్తీకి చెందిన వివాహిత రాచర్ల మౌనిక(26), బెల్లంపల్లి మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ సింగతి విష్ణువర్ధన్‌( 26) క్రిమిసంహారక మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం బద్ది పోచమ్మ వీధిలోని ఓ ప్రైవేటు లాడ్జీలో వెలుగు చూసింది. వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. 
 
నిజానికి విష్ణువర్ధన్, మౌనికలు టెన్త్ క్లాస్ నుంచి ప్రేమించుకున్నారు. కానీ, మౌనికకు కరీంనగర్‌ జిల్లా ఓదెల గ్రామానికి చెందిన రాచర్ల అశోక్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కూతురు అమతవర్షిణీ, నాలుగేళ్ల కుమారుడు ఆర్యన్‌ ఉన్నారు. మూడేళ్ల క్రితం మౌనికను ఆమె తండ్రి గుండారపు కృష్ణ మూడేళ్ల క్రితం బెల్లంపల్లికి తీసుకునిరాగా, స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మౌనిక ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు చేస్తోంది. ప్రస్తుతం ఆమె తృతీయ సంవత్సరం చదువుతోంది.
 
అయితే మౌనిక వివాహం చేసుకున్నా చిన్ననాటి స్నేహితుడు లింగాపూర్‌ గ్రామానికి చెందిన విష్ణును మరిచిపోలేక పోయింది. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న మౌనిక వివాహేతర బంధం సాగిస్తూ వచ్చింది. ఈ విషయం భర్తకు తెలిసి మందలించాడు కూడా. ఈ క్రమంలో ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు చేస్తున్న మౌనిక ప్రతిరోజు స్థానిక ప్రభుత్వాసుపత్రికి ప్రాక్టీకల్స్‌ చేయడానికి కాలేజీ నుంచి విష్ణు ఆటోలో వెళ్లేది. దీంతో వారిద్దరి మధ్య బంధం మరింత బలపడింది. 
 
కానీ, కలిసి జీవించలేక పోతున్నామనే బాధ వారిని వెంటాడుతూ వచ్చింది. ఆమెకు పెళ్లి కావడం, ఇద్దరు పిల్లలు ఉండటం ఓ కారణమైతే, ఇద్దరి కులాలూ వేరు కావడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు ఎదుర్కొన్నారు. భర్త నుంచి ఆమెకు విడాకులు ఇప్పించినా తన సామాజికవర్గం అంగీకరించదని విష్ణు ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలోనే వేములవాడకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ మహిళా స్వీపర్ జీతం.. రూ.1,47,722, తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తారు...