ఆలయంలో కీచకపర్వం.. గర్భగుడిలో కోర్కె తీర్చాలంటూ...
పవిత్రమైన దైవసన్నిధిలో ప్రశాంతంగా దేవుని సేవలో పాల్గొనేందుకు వెళ్లిన ఓ మహిళకు లైంగిక వేధింపులకుగురైంది. గర్భగుడిలో కోర్కె తీర్చాలంటూ ఓ కామాంధుడు వేధించాడు. ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేస్తే తనపై కక్షకట
పవిత్రమైన దైవసన్నిధిలో ప్రశాంతంగా దేవుని సేవలో పాల్గొనేందుకు వెళ్లిన ఓ మహిళకు లైంగిక వేధింపులకుగురైంది. గర్భగుడిలో కోర్కె తీర్చాలంటూ ఓ కామాంధుడు వేధించాడు. ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేస్తే తనపై కక్షకట్టి తనను, తన కుమార్తెను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడని కన్నీళ్లపర్యంతమైంది. స్పందించిన ఎస్పీ వెంటనే బాధిత మహిళ సమస్య పరిష్కరించి ఆమెకు రక్షణ కల్పించాలని ఆదేశించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన ఓ మహిళ సమీపంలోని ఓ ఆలయానికి సేవచేయడానికి వెళుతుండేది. అక్కడ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. భగవంతుని సేవ కోసం అతని చేష్టలను కొంతకాలం భరించింది. కొద్దికాలానికి సదరు మహిళ భర్త మృతి చెందాడు. ఊహించని విధంగా తనకు జరిగిన దానికి ఆమె ఒంటిరిదై పోయింది. ఆ బాధ నుంచి బయట పడటానికి ఆలయానికి వెళుతూ దైవ సన్నిధిలో సేదతీరేది. ఆ సమయంలో తన కోర్కె తీర్చాలంటూ బలవంతం చేయసాగాడు.
అదేసమయంలో భర్త చనిపోయాడని తెలుసుకున్నప్పటి నుంచి లైంగిక వేధింపులు మరింతపెంచాడు. అంతటితో ఆగకుండా ఆమెను ఉద్దేశిస్తూ సామాజిక మాధ్యమాల్లో అసభ్య సందేశాలు పెట్టసాగాడు. ఇక అతని వేధింపులు భరించలేక అర్బన్ ఎస్పీ మహిళల రక్షణకు ప్రత్యేకంగా ప్రారంభించిన జ్వాల యాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఎస్పీ సదరు బాధితురాలి సమస్య పరిష్కరించాలని డీఎస్పీ సౌమ్యలతను ఆదేశించారు. దీంతో డీఎస్పీ సౌమ్యలత రంగంలోకి దిగింది.