Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీ మహిళా కార్యకర్తపై దాడి.. కాలితో తన్ని పరిగెత్తించాడు..

బీజేపీకి చెందిన ఓ మహిళా కార్యకర్తపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు ఓవరాక్షన్ చేశారు. మహిళా కార్యకర్తపై టీఎంసీ నేతలు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సెప్టెంబర్ 26వ తేదీన జరిగినప్పటికీ ఆలస్యం

Advertiesment
బీజేపీ మహిళా కార్యకర్తపై దాడి.. కాలితో తన్ని పరిగెత్తించాడు..
, సోమవారం, 1 అక్టోబరు 2018 (12:48 IST)
బీజేపీకి చెందిన ఓ మహిళా కార్యకర్తపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు ఓవరాక్షన్ చేశారు. మహిళా కార్యకర్తపై టీఎంసీ నేతలు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సెప్టెంబర్ 26వ తేదీన జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్‌ 26‌న బీజేపీ రాష్ట్ర బంద్‌ నేపథ్యంలో దిసర్కార్‌ అనే మహిళా నేత తమ కార్యకర్తలతో కోల్‌కతాకు 40 కిలోమీటర్లో దూరంలో ఉన్న బారసత్‌లో రైల్‌రోకో నిర్వహించే ప్రయత్నం చేశారు.

దీనిని అడ్డుకునేందుకు వచ్చిన తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, ఆ పంచాయతీ ఛీఫ్‌ అర్షదుజ్జమాన్‌ సదరు మహిళపై దాడి చేశాడు. కర్రలతో ఆమె బాదాడు. కాలితో తన్ని పరిగెత్తించాడు. ఈ తతంగం అంతా సెల్‌ఫోన్‌లో ఒకరు రికార్డ్‌ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ అయ్యింది. 
 
ఇక ఈ దాడి గురించి ఆమెను ఓ మీడియా రిపోర్టర్‌ తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా.. మరోసారి ఆమెపై మీడియా సాక్షిగానే దాడి చేశారు. ఈ వరుస ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కౌశల్ గురించి పవన్ కళ్యాణ్‌కు అప్పుడే తెలుసా? ఏమన్నారంటే?