Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ మహిళా స్వీపర్ జీతం.. రూ.1,47,722, తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తారు...

ఇటీవల వాట్సాప్‌లో తెగ షేర్‌ అయిన వార్త... 'వ్వా...ట్‌! స్వీపర్‌కు లక్షన్నరజీతం. కాదు.. కాదు.. ఇదేదో ఫేక్‌ న్యూస్ అయివుంటుంది' అంటూ నెటిజన్లు ఓ న్యూస్‌ను వైరల్ చేశారు. కానీ, ఈ వార్త ఫేక్ కాదు.. అక్షరాల

Advertiesment
ఆ మహిళా స్వీపర్ జీతం.. రూ.1,47,722, తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తారు...
, బుధవారం, 3 అక్టోబరు 2018 (16:40 IST)
ఇటీవల వాట్సాప్‌లో తెగ షేర్‌ అయిన వార్త... 'వ్వా...ట్‌! స్వీపర్‌కు లక్షన్నరజీతం. కాదు.. కాదు.. ఇదేదో ఫేక్‌ న్యూస్ అయివుంటుంది' అంటూ నెటిజన్లు ఓ న్యూస్‌ను వైరల్ చేశారు. కానీ, ఈ వార్త ఫేక్ కాదు.. అక్షరాలా నిజం. ఆ స్వీపర్ జీతం 1,47,722 రూపాయలు. కేవలం ఆమె ఒక్కరే కాదు ఇలా లక్షకు పైబడి జీతం తీసుకునే నాలుగో తరగతి ఉద్యోగులు చాలా మందే ఉన్నారు.
 
వారంతా విద్యుత్ డిస్కమ్‌లో పని చేస్తున్నారు. అదీకూడా ఈస్టర్న్‌ పవర్‌ డిస్కమ్‌. విద్యుత్తు శాఖలో ఉద్యోగం అంటే... వేతనాల వరం పొందినట్లే. ఇదంతా సంస్కరణల ఫలం! మొదట్లో విద్యుత్తు శాఖను ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు అని పిలిచేవారు. 
 
ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు విద్యుత్తుశాఖలో సంస్కరణలకు తెరలేపారు. బోర్డు పోయింది. కంపెనీలు వచ్చాయి. విద్యుత్తు ఉత్పత్తికి.. జెన్‌కో! సరఫరాకు.. ట్రాన్స్‌కో ఏర్పడ్డాయి. ట్రాన్స్‌కోలో మళ్లీ ప్రాంతాల వారీగా డిస్కమ్‌లను ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖలో చేపట్టిన సంస్కరణ ఫలితంగా ఆమె జీతం లక్షకు చేరింది. ఆమె పేరు రాజమహేంద్రవరం. 
 
రాజమహేంద్రవరం తాడితోట ప్రాంతానికి చెందిన కోల వెంకటరమణమ్మ 1978లో 16వ ఏటనే విద్యుత్తు శాఖలో రోజువారీ ఉద్యోగిగా చేరారు. ఆమె తల్లి కూడా అక్కడే స్వీపర్‌గా పని చేసేవారు. 1981 ఏప్రిల్‌ 1వ తేదీన రమణమ్మ పర్మినెంట్‌ ఎంప్లాయ్‌ అయ్యారు. అప్పటి నుంచి రాజమహేంద్రవరం సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కార్యాలయంలోని విద్యుత్‌ చౌర్య నిరోధక విభాగంలోనే పని చేస్తున్నారు. ఇప్పటికే ఆమె సర్వీసు 40 ఏళ్లు దాటింది. 
 
రిటైర్‌మెంట్‌కు మరో నాలుగేళ్లు ఉంది. వెరసి... సుదీర్ఘ సర్వీసుకావడంతో జీతం కూడా భారీగా పెరుగుతూ వచ్చింది. రమణమ్మ ఉదయం 8 గంటలకు భోజనం డబ్బాతో వచ్చి... రాత్రి 8 గంటలకు ఇంటికి వెళతారు. రమణమ్మ అంటే అందరికీ గౌరవం. తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేయడం ఆమె నైజం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్యోగులకు అమేజాన్ బంపర్ ఆఫర్.. గంటకు రూ.1000