Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోదీ హీరో-బాబు జీరో.. కారు దిగి కమలం తీర్థం పుచ్చుకోనున్న..?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో సోము వీర్రాజు మాట్లాడుతూ, బాబును ఏకిపారేశారు.

Advertiesment
మోదీ హీరో-బాబు జీరో.. కారు దిగి కమలం తీర్థం పుచ్చుకోనున్న..?
, శనివారం, 29 సెప్టెంబరు 2018 (12:17 IST)
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో సోము వీర్రాజు మాట్లాడుతూ, బాబును ఏకిపారేశారు. 
 
సమర్థ పరిపాలనలో ప్రధాని నరేంద్ర మోడీ హీరో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు జీరో అంటూ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు పొట్ట విప్పితే అన్ని అబద్దాలేనని మండిపడ్డారు. మోడీ జపం చేయనిదే చంద్రబాబుకు తెల్లవారటం లేదని సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన అవార్డులు మొత్తం కేంద్ర ప్రభుత్వ పథకాలకి వచ్చినవే అన్నారు.
 
ఇదిలా ఉంటే.. తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూ మోహన్. ఇటీవల కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో కొద్ది రోజుల నుంచి మనస్తాపంగా ఉన్న బాబూమోహన్... ఆందోల్ టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. 
 
ఓ దశలో కంటతడి కూడా పెట్టారు. అయితే బాబూ మోహన్‌కు న్యాయం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఆయన శాంతించలేదు. అందుకే తనదారి తాను చూసుకునేందుకు డిసైడ్ అయ్యారు. కారు దిగి కమలం తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. 
 
ఇందుకోసం ఢిల్లీ వెళ్ళారు. బాబుమోహన్ పాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ కూడా హస్తినకు వెళ్లినట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో ఆయన కమలం పార్టీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రణయ్‌ని ప్రాణాలతో తీసుకొస్తేనే నా తండ్రిని క్షమిస్తా: అమృత వర్షిణి