Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రణయ్‌ని ప్రాణాలతో తీసుకొస్తేనే నా తండ్రిని క్షమిస్తా: అమృత వర్షిణి

మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అమృతను కంటికి రెప్పలా మారుతీరావు చూసుకునేవారని జోరుగా ప్రచారం సాగుతోంది. తప్పంతా అమృత, ప్ర

Advertiesment
ప్రణయ్‌ని ప్రాణాలతో తీసుకొస్తేనే నా తండ్రిని క్షమిస్తా: అమృత వర్షిణి
, శనివారం, 29 సెప్టెంబరు 2018 (11:46 IST)
మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అమృతను కంటికి రెప్పలా మారుతీరావు చూసుకునేవారని జోరుగా ప్రచారం సాగుతోంది. తప్పంతా అమృత, ప్రణయ్‌దేనని నెట్టింట చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో అమృతవర్షిణి తన తండ్రి గురించి మాట్లాడింది. 
 
పరువు కోసం తన భర్తను హత్య చేయించిన తండ్రి స్టేటస్‌ పోయిందని, అదే సమయంలో ప్రేమ కోసం ప్రాణ త్యాగం చేసినందుకు ప్రణయ్‌ వ్యాల్యూ ఎంతో పెరిగిందని భార్య అమృత వర్షిణి పేర్కొంది. ప్రణయ్ తల్లిదండ్రులు తనను కన్నకూతురుకంటే ఎక్కువగా చూసుకున్నారని చెప్పింది. తన కంట్లో నలకపడ్డా తండ్రి మారుతీరావు తట్టుకోలేడన్న ప్రచారం బయట జరుగుతోందని.. అది ఏమాత్రం నిజం కాదని అమృత తేల్చేసింది. 
 
తన సంతోషం కంటే.. తన తండ్రికి పరువే ముఖ్యమని.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఎన్నోసార్లు హెచ్చరించేవాడని అమృత చెప్పింది. ప్రణయ్‌ను హత్య చేసినప్పటికీ తన తల్లి తండ్రి మారుతీరావుకే సపోర్ట్ చేస్తోందనీ, అందుకే ఇప్పటివరకూ బయటకు రాలేదని అమృత విమర్శించింది. ప్రణయ్ హత్య కేసులో తన తల్లి పాత్ర ఎంతవరకూ ఉందో తనకు తెలియదని అమృత చెప్పుకొచ్చింది.
 
తన జీవితం నాశనమైపోయినా.. తన భర్తను కాపాడుకోవాలని మల్లగుల్లాలు పడుతుందని చెప్పింది. ప్రణయ్‌ను ప్రాణాలతో తీసుకొస్తేనే తన తండ్రిని క్షమిస్తానని అమృత స్పష్టం చేసింది. అది ఆయన తరం కాదని తెలుసునని కంటతడి పెట్టింది. బాబాయ్ శ్రవణ్ కుమారుడు తనతో అసభ్యంగా ప్రవర్తిస్తే, కనీసం అతడిని మందలించడం కానీ, కొట్టడం కాని చేయలేదని వాపోయింది. తండ్రి మారుతీరావు, బాబాయ్ శ్రవణ్ తనను విపరీతంగా కొట్టేవారని అమృత ఆవేదన వ్యక్తం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుంభమేళాకు రంగం సిద్ధం- మాంసం ముట్టని పోలీసుల కోసం ఇంటర్వ్యూ