Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్‌లో మళ్ళీ చెలరేగిన జాతుల మధ్య ఘర్షణ - 9 మంది మృతి

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (12:53 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణలు మళ్లీ చెలరేగాయి. ఈ ఘర్షణల్లో తొమ్మిది మంది చనిపోయారు. ఈ రాష్ట్రంలో రెండు జాతుల మధ్య చెలరేగిన హింస కారణంగా కొద్దిరోజులుగా ఈశాన్య రాష్ట్రం మణిపుర్ అట్టుడుకిపోతోంది. 
 
ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ మరోసారి చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో తొమ్మిది మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఓ మహిళ కూడా ఉందని సమాచారం. పలువురు గాయపడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 
 
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌ తూర్పు జిల్లాలోని ఖమెన్‌లక్‌ ప్రాంతంలో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఉగ్రవాదులు, గ్రామ వాలంటీర్ల మధ్య సోమవారం రాత్రి వరకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటన కారణంగా తొమ్మిది మంది మృతి చెందారని, ఐదుగురు గాయపడ్డారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ధ్రువీకరణ మాత్రం రాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments