Webdunia - Bharat's app for daily news and videos

Install App

8 నెలల పాపపై 28 ఏళ్ల కామాంధుడి అత్యాచారం.. పరిస్థితి విషమం

దేశంలో రోజూ అత్యాచారాలు ఏదో ఓ ప్రాంతంలో జరుగుతూనే వున్నాయి. ఇందులో ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో అయితే అత్యాచారాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. మహిళలపై దురాగతాలు ఢిల్లీలో సర్వసాధారణంగా జరిగిపోతున్న

Webdunia
మంగళవారం, 30 జనవరి 2018 (18:23 IST)
దేశంలో రోజూ అత్యాచారాలు ఏదో ఓ ప్రాంతంలో జరుగుతూనే వున్నాయి. ఇందులో ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో అయితే అత్యాచారాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. మహిళలపై దురాగతాలు ఢిల్లీలో సర్వసాధారణంగా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని సుభాష్ నగర్ ప్రాంతంలో ఓ కామాంధుడు విరుచుకుపడ్డాడు. 
 
పుట్టి ఎనిమిది నెలలే అయిన ఆడ శిశువుపై 28 ఏళ్ల కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎనిమిది నెలల చిన్నారిని.. ఆ శిశువు తల్లిదండ్రులు 28 ఏళ్ల ఓ వ్యక్తి పర్యవేక్షణలో వుంచి ఉద్యోగాలకు వెళ్లేవారు. అయితే చిన్నారిని వదిలిపెట్టి తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లాక.. ఆ కామాంధుడు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో చిన్నారి జననాంగంలో రక్రస్రావం కావడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారికి చికిత్స అందించిన వైద్యులు పాపపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు.
 
చిన్నారి నోటికి గుడ్డకట్టి ఆ కామాంధుడు అత్యాచారానికి పాల్పడటంతో.. బాధితురాలైన పాప శ్వాస తీసుకోవడానికి శ్రమిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికే చిన్నారికి శస్త్రచికిత్స చేశామని, అయినప్పటికీ చిన్నారి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కామాంధుడిని అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments