Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి కోసం బడాబాబును పెళ్లి చేసుకుంది.. చివరికి ఏం చేసిందంటే?

జల్సాకు అలవాటు పడి ఓ యువతి దొంగతనాలు చేస్తూ దొరికిపోయింది. తాను వలచిన యువకుడిని వివాహం చేసుకునేందుకు ఓ బడాబాబును వివాహం చేసుకుని.. అతని ఇంట్లో నుంచి ఒక్కో వస్తువును దోచుకునేది. ఇలా ఇంట్లోనే దొంగతనానిక

Webdunia
మంగళవారం, 30 జనవరి 2018 (15:53 IST)
జల్సాకు అలవాటు పడి ఓ యువతి దొంగతనాలు చేస్తూ దొరికిపోయింది. తాను వలచిన యువకుడిని వివాహం చేసుకునేందుకు ఓ బడాబాబును వివాహం చేసుకుని.. అతని ఇంట్లో నుంచి ఒక్కో వస్తువును దోచుకునేది. ఇలా ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన యువతిపై భర్తకు అనుమానం వచ్చి.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన పావని (28)కి హైదరాబాద్, అంబర్ పేటలో ఉండే కిషోర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కిషోర్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్న పావని.. అతనికి ఆర్థికంగా సహకరించేది. ముంబైలో సట్టా నిర్వహించే కిషోర్ కోసం అప్పుడప్పుడు ఆమె ముంబైకి వెళ్లేది. 
 
గతంలో టర్కీ కరెన్సీని సరఫరా చేస్తూ పావని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో కొత్త ప్లాన్ వేసింది. ఆర్థికంగా బాగా స్థిరపడిన బడాబాబు రమేష్ అనే యువకుడిని పెళ్లి పేరిట నమ్మించింది. వివాహం కూడా చేసుకుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న రమేష్‌కు దక్షిణాఫ్రికాలో జాబ్ కూడా వచ్చింది. 
 
ఇక రమేష్ ఇంట్లోని వస్తువులను దొంగలించి ప్రియుడికి ఇచ్చేది. ఈ విషయం తెలుసుకున్న రమేష్ కుటుంబీకులు ఇంటి నుంచి గెంటేసినా.. మోసాలకు బ్రేక్ వేయకపోవడంతో ఉష అనే యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పావనిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments