గన్ తీసుకొని గర్ల్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్.. తర్వాత ఏమైంది..
యువతీయువకులు తమ వెర్రి చేష్టలతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. సెల్ఫీలు, వీడియోకాల్‌లు అంటూ సిల్లీగా అనిపించే విషయాలను కూడా సీరియస్‌గా తీసుకుంటూ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేస్తూ తమ తల్లిదండ్రులకు తీరన
యువతీయువకులు తమ వెర్రి చేష్టలతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. సెల్ఫీలు, వీడియోకాల్‌లు అంటూ సిల్లీగా అనిపించే విషయాలను కూడా సీరియస్‌గా తీసుకుంటూ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేస్తూ తమ తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగులుస్తున్నారు. తన గర్ల్‌ఫ్రెండ్‌తో వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడుతూ ఓ యువకుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. చేతిలోని తుపాకీ అనూహ్యంగా పేలడంతో ఆ బుల్లెట్ నేరుగా తలలో నుంచి దూసుకుపోయి అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ వివరాలను పరిశీలిస్తే,
బీహార్ రాష్ట్రంలోని సాయిచాక్ అనే గ్రామానికి చెందిన అకాష్ కుమార్ (బంటీ) అనే 19 ఏళ్ల యువకుడు తన ప్రియురాలికి వాట్సాప్ ద్వారా వీడియోకాల్ చేశాడు. ఆ సమయంలో సెమీ ఆటోమేటిక్ పిస్టల్ చేతిలో పట్టుకొని సరదాగా ఆటపట్టిస్తూ తలకు గురిపెట్టుకొని దాదాపు 2 గంటల పాటు మాట్లాడాడు. దాన్ని చూపిన ఆమె, ఎలాంటి అఘాయిత్యమూ చేయవద్దని వేడుకుంది. ఆమెను చూస్తూనే ఆత్మహత్య చేసుకుంటాను చూడమని చెబుతూ, తలకు తుపాకిని గురి పెట్టుకున్నాడు.
ఆ సమయంలో పొరపాటున ట్రిగ్గర్‌కు అతని వేలు తగలడంతో పెద్ద శబ్దంతో తుపాకి పేలింది. ఆ శబ్దం విన్న ఇంట్లోని వారు వచ్చేసరికే అతను మరణించాడు. ఫోనులో తుపాకి శబ్దాన్ని మాత్రమే విన్న ప్రియురాలు, ఆపై అతనికి 80 మార్లు కాల్ చేసింది. ఇక అతని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, తల్లిదండ్రులు నిశ్చయించిన వివాహం ఇష్టం లేకనే అతను ఆత్మహత్యకు ప్రయత్నించి ఉండవచ్చని భావిస్తున్నట్టు తెలిపారు.