Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహరాష్ట్రలో ఘోరం... నదిలో బోల్తాపడిన బస్సు.. 13 మంది జలసమాధి

మహారాష్ట్రలో ఘోరం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి ఓ బస్సు నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు జల సమాధి అయ్యారు. ఈ ప్రమాదం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగింది.

Advertiesment
మహరాష్ట్రలో ఘోరం... నదిలో బోల్తాపడిన బస్సు.. 13 మంది జలసమాధి
, శనివారం, 27 జనవరి 2018 (09:47 IST)
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి ఓ బస్సు నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు జల సమాధి అయ్యారు. ఈ ప్రమాదం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జరిగింది. మొత్తం 17 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్ అదుపు తప్పి పంచగంగ నదిలో బోల్తాపడింది.
 
శుక్రవారం అర్ధరాత్రి బస్సు శివాజీ బ్రిడ్జిపైకి చేరుకున్న తర్వాత డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు నదిలో బోల్తా పడిందనీ, ఈ ఘటనలో 13 మంది చనిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. పుణెలోని బలెవాడికి చెందిన ప్రయాణికులు గణ‌్ పతిపులె నుంచి తమ ఇళ్లకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెరుగుతున్న యూపీఏ బలం.. తగ్గుతున్న మోడీ హవా