Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందాన్ని చూపించేలా దుస్తులు ధరిస్తే అత్యాచారం చేయమని ఆహ్వానించినట్టే : మహిళా టీచర్

ఇటీవలికాలంలో అమ్మాయిల వస్త్రధారణపై వివిధ రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, ప్రాశ్చాత్యసంస్కృతి ప్రభావం ఎక్కువగా ఉండటంతో అమ్మాయిలు అబ్బాయిలను రెచ్చగొట్టేలా దుస్తులు ధరిస్తున్నారనే కామెంట్స్ వి

Advertiesment
అందాన్ని చూపించేలా దుస్తులు ధరిస్తే అత్యాచారం చేయమని ఆహ్వానించినట్టే : మహిళా టీచర్
, మంగళవారం, 30 జనవరి 2018 (11:32 IST)
ఇటీవలికాలంలో అమ్మాయిల వస్త్రధారణపై వివిధ రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, ప్రాశ్చాత్యసంస్కృతి ప్రభావం ఎక్కువగా ఉండటంతో అమ్మాయిలు అబ్బాయిలను రెచ్చగొట్టేలా దుస్తులు ధరిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రధానంగా పొట్టి దుస్తులు ధరించినా, వక్షోజ ఆకృతులు స్పష్టంగా కనిపించేలా ధరించినా, ఇతర అవయవాలు చూపినట్టయితే స్వయంగా రేప్‌కు ఆహ్వానించినట్టేనని రాయ్‌పూర్ కేంద్రీయ విద్యాలయంలో పని చేసే మహిళా బయాలజీ టీచర్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆమెపై కేసు కూడా నమోదైంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ వర్శిటీలో స్నేహలతా శంఖ్వార్ అనే మహిళ బయాలజీ టీచర్‌గా పని చేస్తోంది. ఈమె ఇటీవల 11, 12వ తరగతి విద్యార్థినులకు కౌన్సెలింగ్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అమ్మాయిలు జీన్స్ వేసుకుని, లిప్‌స్టిక్ పెట్టుకుంటే నిర్భయ వంటి ఘటనలు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు. అందాన్ని చూపించేలా దుస్తులు ధరిస్తే, అత్యాచారం చేయమని ఆహ్వానం పలికినట్టేనని అన్నారు. పొట్టి వస్త్రాలు వేసుకున్నా, ఇష్టం వచ్చినట్టు బయట తిరిగినా నిర్భయకు పట్టే గతే పడుతుందని హెచ్చరించారు. 
 
అమ్మాయిలు మరీ సిగ్గు లేకుండా తయారవుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. అత్యాచారాలు అమ్మాయిలు చేసే పాపాలకు శిక్షని, తన శరీరాన్ని బయటకు చూపించే అమ్మాయిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే అబ్బాయి భావిస్తాడని అన్నారు. అందమైన ముఖాలు లేని అమ్మాయిలు తమ శరీరాన్ని బయటకు చూపించవచ్చని స్నేహలత ముక్తాయింపు ఇచ్చారు. ఇక ఆమె కౌన్సెలింగ్ వ్యాఖ్యలను కొందరు అమ్మాయిలు రహస్యంగా వీడియో తీశారు. ఆ తర్వాత తమ తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌన్సెలింగ్ పేరుతో తమను మానసికంగా వేధించారంటూ ఆరోపిస్తూ వీడియోను జతచేసి ఫిర్యాదు చేశారు. ఫలితంగా ఆమెపై కేసు నమోదు నమోదైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చిందనీ ముగ్గురుని చంపేశాడు...