Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణెలో పెరిగిపోతున్న జికా వైరస్ కేసులో... ఒకే రోజు 8 నమోదు

ఠాగూర్
శుక్రవారం, 9 ఆగస్టు 2024 (09:39 IST)
మహారాష్ట్రలోని ప్రధాన నగరాల్లో ఒకటైన పూణెలో జికా వైరస్ ప్రబలుతుంది. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. గురువారం ఒక్క రోజే ఏకంగా ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో పూణెలో గత జూన్ నెలలో మొత్తం కేసుల సంఖ్య 66 నమోదు కాగా, గురువారం ఒక్కరోజే మరో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసుల్లో ఆరుగురు గర్భిణీ మహిళలు ఉండటం గమనార్హం. అలాగే, మొత్తం కేసుల సంఖ్య 74కు చేరింది. ఆ రాష్ట్ర వైద్య నివేదికల ప్రకారం పూణెలో జికా వైరస్ బారినపడి ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించాయి. 
 
అయితే, మృతుల అసలు కారణాలపై ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. జికా సోకిన వారిలో 26 మంది గర్భిణులు ఉన్నారు. ఈ వైరస్ సోకిన వారిలో మిగిలిన వారంతా ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. మృతి చెందిన నలుగురు రోగులు 68 నుంచి 78 ఏళ్ల వయస్కులు. 
 
'66 కేసులలో (నిన్నటి వరకు నమోదైన కేసులు) నాలుగు మరణాలు ఉన్నాయి. అయితే ఈ మరణాలు జికా వల్ల కాకపోవచ్చు. ఈ రోగులు ఇతర సమస్యల వల్ల కూడా బాధపడుతున్నారు. వారు వృద్ధులు' అని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మరణాలకు అసలు కారణంపై పూర్తి వివరాల కోసం పుణే మున్సిపల్ కార్పోరేషన్ ఆరోగ్య విభాగం నివేదికలను మహారాష్ట్ర ప్రభుత్వం డెత్ ఆడిట్ కమిటీకి పంపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments