Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కారుడ్ సైడ్ ఇవ్వలేదని మహిళ ముక్కు పగలగొట్టిన వ్యక్తి.. Video Viral

Advertiesment
pune woman

వరుణ్

, ఆదివారం, 21 జులై 2024 (12:42 IST)
కొందరు క్షణికావేశానికి గురవుతూ, చిక్కుల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఓ మహిళ మక్కు పగలగొట్టాడు. తన కారుకు దారి ఇవ్వలేదన్న అక్కసుతో ఈ దారుణానికి పాలపడ్డాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాల్ అవుతుంది. 
 
మహారాష్ట్ర - పుణెలో 27 ఏళ్ల ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటీలో బనెర్-పాషన్ రోడ్డుపై వెళ్తున్నారు. ఆమె వెనకాలే దాదాపు రెండు కిలోమీటర్ల వరకు కారులో వచ్చిన స్వప్నిల్ కెక్రే అనే వ్యక్తి ఆమెను ఓవర్ టేక్ చేశాడు. ఒక్కసారిగా స్కూటీ ముందు కారు ఆపి ఆమె జుట్టు పట్టుకొని ముక్కుపై పిడిగుద్దులు కురిపించాడు. 
 
తీవ్రంగా కొట్టడంతో ఆమె ముక్కు నుంచి రక్తం కారింది. జరిగిన విషయాన్ని వివరిస్తూ సదరు మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దారివ్వలేదని ఆరోపిస్తూ తనపై దాడికి పాల్పడ్డాడని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు.. భారీ సంఖ్యలో భక్తుల హాజరు