Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా.. ఆఫీసులకు వచ్చేది లేదు.. వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాం.. ఉద్యోగులు

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (13:51 IST)
కరోనా నేపథ్యంలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా ముగిసిన తర్వాత అందరూ ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజా సర్వేలో ఓ షాకింగ్ న్యూస్ వెల్లడి అయ్యింది. 
 
అయితే కరోనా ప్రభావం తగ్గేవరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ తరువాతే ఉద్యోగులు ఎలాంటి భయం లేకుండా ఆఫీసులకు వెళ్తారని అంటున్నారు. కరోనాకు అతి త్వరలో వ్యాక్సిన్లు రానున్న నేపథ్యంలో.. ప్రజలందరూ వ్యాక్సిన్లు తీసుకుంటే.. తిరిగి ఎప్పటిలా కార్యకలాపాలు కొనసాగుతాయని అంటున్నారు.
 
దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 70 శాతం మంది ఇంటి నుంచే పనిచేయాలని భావిస్తున్నారని వెల్లడైంది. దేశంలోని 15 భిన్నమైన రంగాలకు చెందిన 550 కంపెనీల్లో పనిచేస్తున్న 1800 మంది ఉద్యోగులపై సర్వే చేశారు. దీంతో వారిలో 70 శాతం మంది ఇంటి నుంచే పనిచేయాలని ఉందని చెప్పారు. 
 
కేవలం 30 శాతం మాత్రమే కార్యాలయాలకు వెళ్లాలని ఉందని వెల్లడించారు. అయితే ఆ 30 శాతం మంది కూడా ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో పనిచేస్తున్నవారు కావడం విశేషం. వారిలో చాలామంది మేనేజర్ లెవల్‌లో పనిచేస్తున్నారు. అందువల్లే వారు కార్యాలయాలకు వెళ్లాలని కోరుకుంటున్నారు. ఇక మిగిలిన వారందరూ సాధారణ ఉద్యోగులు. ఈ క్రమంలో వారు ఇంటి నుంచే పనిచేయాలని ఉందని తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments