Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస : ఇద్దరు పోలీసులతో సహా ఏడుగురి మృతి

వరుణ్
శుక్రవారం, 19 జనవరి 2024 (10:31 IST)
ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. ఈ హింసలో ఇద్దరు పోలీసులతో పాటు ఒక గ్రామ వలంటీర్‌తో సహా ఏడుగురి ప్రాణాలు కోల్పోయారు. దీంతో మణిపూర్ వాసులు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. బిష్ణుపూర్ జిల్లాలో చెలరేగిన హింసలో నలుగురు హత్యకు గురయ్యారు. వీరితో కలుపుకుని తాజాగా హింసలో మృతి చెందిన వారి సంఖ్య ఏడుకు పెరిగింది. వీరిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. మోరే గ్రామంలో సాయుధ మిలిటెంట్లు వీరిని కాల్చి చంపారు. మరో గ్రామంలో దుండగులతో జరిగిన ఎదురు కాల్పుల్లో విలేజ్ వలంటీర్ మృతి చెందారు. 
 
రిజర్వేషన్లు విషయంలో కుకీల, వెయిటీలకు మధ్య రేకెత్తిన అల్లర్లతో అల్లకల్లోలంగా మారిన మణిపూర్‌లో ఇటీవల జరిగిన ఘర్షణల్లో 175మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులపాటు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. తాజాగా గత 48 గంటల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్రతకు అద్దం పడుతుంది. తాజాగా ఘర్షణల నేపథ్యంలో ప్రజల భయంభయంగా గడుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments