Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుచనా సేథ్.. కన్నబిడ్డను చంపిందా.. రక్తంతో తడిసిన టవల్.. దగ్గు సిరప్..?

Advertiesment
crime scene

సెల్వి

, బుధవారం, 10 జనవరి 2024 (23:08 IST)
సుచనా సేథ్ అనే బెంగళూరు మహిళ తన భర్త పిఆర్ వెంకట్ రామన్‌తో విడాకుల పోరులో తన నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసింది. పిల్లవాడిని, తనను తాను శారీరకంగా హింసించాడని ఆమె ఆరోపించింది. భర్త వార్షిక ఆదాయం రూ. 1 కోటి కంటే ఎక్కువ ఉందని పేర్కొంటూ, నెలకు రూ. 2.5 లక్షల భరణం కోరింది. ఇందుకోసం కోర్టు పత్రాలు, వాట్సాప్ సందేశాలు, అలాగే వైద్య రికార్డులను సమర్పించి, గృహహింసకు సంబంధించిన తన వాదనను రుజువు చేసింది.
 
 హత్య జరిగినప్పుడు ఇండోనేషియాలో ఉన్న రామన్ గృహ హింస ఆరోపణలను ఖండించారు. తన కుమారుడిని చూసేందుకు వారానికి ఓ రోజు అవకాశం ఇచ్చింది కోర్టు. సేథ్ , రామన్ నవంబర్ 2010 లో వివాహం చేసుకున్నారు. వారికి ఆగస్టు 2019లో కుమారుడు జన్మించాడు. సేథ్ మార్చి 2021 నుండి తన భర్త నుండి వేరుగా జీవిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. అయితే సేథ్ మంగళవారం తన కుమారుడి మృతదేహాన్ని గోధుమ రంగు బ్యాగ్‌లో నింపి పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. 
 
కర్ణాటకలోని చిత్రదుర్గలో ఆమెను అరెస్టు చేశారు. గోవా సర్వీస్ అపార్ట్‌మెంట్‌లోని సిబ్బంది ఆమె గదిని శుభ్రం చేస్తుండగా రక్తంతో తడిసిన టవల్‌ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బెంగళూరుకు తీసుకెళ్తున్న టాక్సీ ఎంఎస్ సేథ్ డ్రైవర్‌ను సంప్రదించి, తెలివిగా అతన్ని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
 
చిన్నారి ఎలా చనిపోయిందో తనకు తెలియదని, నిద్రపోయిన తర్వాత చనిపోయాడని ఆమె పోలీసులకు తెలిపింది. అయితే సేథ్‌ను ఆరు రోజుల పాటు కస్టడీలో ఉంచిన గోవా పోలీసులు, ఇప్పటివరకు, ఆమె ఇచ్చే వివరణలను నమ్మట్లేదు. 
 
రక్తంతో తడిసిన టవల్, ఆమె గదిలో ఖాళీ సీసాల దగ్గు సిరప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె బిడ్డకు అధిక మోతాదులో మందు ఇచ్చి, మత్తు ఎక్కిన తర్వాత దిండు లేదా బెడ్ షీట్‌తో ఊపిరాడక చేసి చంపి వుండవచ్చునని  పోలీసులు భావిస్తున్నారు.

దీనిపై ఇంకా విచారణ సాగుతోంది. సుచనా సేథ్ - తన కుమారుడిని హత్య చేసి ఆత్మహత్యకు ప్రయత్నించి ఉండవచ్చు. ఎందుకంటే ఆమె మణికట్టు కోసినట్లు గుర్తించబడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్‌బీఐలోకి ఎంటరైన ఎద్దు.. కౌంటర్ దగ్గర నిలబడి..?