Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

10-01-2024 బుధవారం దినఫలాలు - అన్నపూర్ణాష్టకం చదవటం వల్ల దోషాలు...

astro1

రామన్

, బుధవారం, 10 జనవరి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మార్గశిర బ|| చతుర్ధశి రా.7.38 మూల రా.7.35 సా.వ.6.01 ల 7.35 తె.. 4.53.6.26. ప.దు. 11.43 ల 12.26.
అన్నపూర్ణాష్టకం చదవటం వల్ల దోషాలు తొలగిపోతాయి.
 
మేషం :- దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కోర్టుకు హాజరవుతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కంప్యూటర్ రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ కృషికి తగిన ప్రతిఫలం ఆలస్యంగా అందుతుంది. ఆదాయం బాగున్నా ఏదో తెలియని అసంతృప్తి, అసహనానికి లోనవుతారు.
 
వృషభం :- సమావేశాల్లో మీకు గుర్తింపు లభిస్తుంది. సన్నిహితుల ఆంతరంగిక విషయాలు ప్రస్తావనకు వస్తాయి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటుకు గురవుతారు. ఓ వార్త మిమ్ములను ఆశ్చర్యపరుస్తుంది. సోదరీ సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి.
 
మిథునం :- రావలసిన ధనం రావడంతో పాటు ఖర్చులు కూడా అధికమవుతాయి. సాహిత్య సదస్సులలోను, బృంద కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. పాత సమస్యలు పరిష్కారమార్గంలో నడుస్తాయి. తోటి ఉద్యోగుల మీద ఆధారపడి ఏకార్యములు చేయవద్దు. దూరప్రయాణాలు సంభవిస్తాయి. కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండుట మంచిది.
 
కర్కాటకం :- రుసుములు చెల్లించగలుగుతారు. మనుషుల మనస్తత్వం తెలుసుకొని మసలుట మంచిది. ప్రైవేటు సంస్థలలోని వారికి నిరుత్సాహం కలిగిస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు తోటివారితో సమస్యలు తలెత్తుతాయి. ఏజెంట్లు, మార్కెటింగ్ రంగాల వారి టార్గెట్లు పూర్తికాగలవు.
 
సింహం :- ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం అధికమవుతాయి. ప్రేమికుల మధ్య అనుమానాలు తొలగిపోతాయి. తలచిన పనులు ఎరవేరి మీ కోరికలు తీరగలవు. చేపట్టిన పనులలో ఓర్పు, పట్టుదల అవసరం. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారముంది.
 
కన్య :- అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో సమన్వయం లోపిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, పరిస్థితుల అనుకూలతలు ఉంటాయి.
 
తుల :- కుటుంబీకుల ఆరోగ్యంలో మెళకువ వహించండి. మిర్చి, నూనె, ఆవాలు, చింతపండు, వెల్లుల్లి వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. రవాణా రంగంలోని వారికి చికాకులు అధికమవుతాయి. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారి ఒత్తిడి పెరుగుతుంది. తలపెట్టిన పనిలో కొంతముందు వెనుకలుగానైనను సంతృప్తి కానరాగలదు.
 
వృశ్చికం :- రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. భాగస్వామిక ఒప్పందాల్లో మీ ప్రతిపాదనలకు వ్యతిరేకత ఎదురవుతుంది. అనుకున్న మొత్తం చేతికందుతుంది. మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషిచేయండి.
 
ధనస్సు :- చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువవహించండి. వాతావరణంలోని మార్పు రైతులకు ఆందోళన కలిగిస్తుంది. వాహన చోదకులకు ఇబ్బందులు తప్పవు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
మకరం :- భాగస్వామ్యులతోకొన్ని సమస్యలు తలెత్తుతాయి. స్త్రీల అభిప్రాయాలకు వ్యతిరేకత ఎదురవుతుంది. అందరకీ సహాయం చేసి మాటపడతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. వృత్తి, వ్యాపారాలకు సంబందించిన విషయాలు కలవర పెడతాయి. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి.
 
కుంభం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టుట వలన దేనిమీద ఏకాగ్రత వహించలేరు. విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. మీ యత్నాలకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు.
 
మీనం :- ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. స్త్రీలకు షాపింగ్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్తగా చేపట్టబోయే వ్యాపారాలు, సంస్థలకు కావలసిన పెట్టుబడి సర్దుబాటు కాగలదు. మార్కెట్ రంగాల వారికి, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. ఏదైనా అమ్మకానికైచేయు ఆలోచన వాయిదా వేయటం మంచిది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్గశిర మూలా నక్షత్రం ఏం చేయాలి..