Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

05-01-2024 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన మీ సంకల్పం...

Advertiesment
Shukra Vakri 2023

రామన్

, శుక్రవారం, 5 జనవరి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| మార్గశిర ఐ|| నవమి రా.7.49 చిత్త సా. 4.45 రావ. 10. 43 ల 12.25.
ఉ.దు. 8.47 ల 9.31 ప.దు. 12.27 ల 1.11. 
 
లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన మీ సంకల్పం నెరవేరుతుంది.
 
మేషం :- ఫ్యాన్సీ, మందులు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రైవేటు సంస్థల్లో వారికి, ఆడిటర్లకి ఒత్తిడి పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు బంధువర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు మీ ఉన్నతిని గుర్తిస్తారు. విద్యార్థులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. 
 
వృషభం :- మీ కార్యక్రమాలు, ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేసుకోవలసివస్తుంది. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా అధికారులతో మాటపడవలసి వస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులు గడచిన కాలం గురించి ఆలోచిస్తూ కాలం వృధా చేయకండి. ఒక స్థిరాస్తి అమ్మకం, అమర్చుకోవాలనే ఆలోచనస్ఫురిస్తుంది.
 
మిథునం :- ఏజెంట్లకు, బ్రోకర్లకు నిరుత్సాహం, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కలిసివచ్చే కాలం. కాంట్రాక్టర్లు ఒకే సమయంలో అనేక పనులు చేపట్టటం వల్ల విమర్శలు, త్రిప్పట అధికమవుతాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటంతో పాటు స్వల్ప లాభాలు గడిస్తారు. మీ ఆకస్మిక ధోరణి కుటుంబీకులకు చికాకు కలిగిస్తుంది. 
 
కర్కాటకం :- ఉద్యోగులు పదోన్నతి, స్థానమార్పిడి యత్నాలలో సఫలీకృతులవుతారు. స్త్రీలకు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే ముందు పునరాలోచన అవసరం. ఏజెన్సీ, లీజు, నూతన కాంట్రాక్టులు అతి కష్టం మీద మీకు అనుకూలిస్తాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు.
 
సింహం :- వస్త్ర, బంగారు, వెండి, ఫ్యాన్సీ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. పెద్దల జోక్యంతో అనుకోకుండా ఒక సమస్య సానుకూలమవుతుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది.
 
కన్య :- ప్రైవేటు సంస్థల్లోని వారు తోటి వారితో స్నేహ భావంతో సంచరిస్తారు. బంధుమిత్రుల కలయికతో ఉత్సాహం చోటుచేసుకుంటుంది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు వాయిదా పడతాయి. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. 
 
తుల :- కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందడంతో నిర్మాణ పనులు చురుకుగా సాగుతాయి. కుటుంబీకుల కోసం నూతన పథకాలు రూపొందిస్తారు. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. స్టేషనరీ, ప్రింటింగు రంగాల వారికి అచ్చు తప్పులు పడటం వల్ల మాట పడక తప్పదు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
వృశ్చికం :- రాబోయే కాలంలో ఖర్చులు, అవసరాలు మరింతగా పెరిగేందుకు ఆస్కారం ఉంది. నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మీ పురోభివృద్ధికి సహకరిస్తాయి. పారిశ్రామిక రంగాల్లో వారు స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి సంతృప్తి కానవస్తుంది. నిరుద్యోగులకు నిరంతర కృషి అవసరమని గమనించండి.
 
ధనస్సు :- తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వ్యాపారాభివృద్ధికై చేయుకృషిలో సఫలీకృతులవుతారు. ప్రేమికులకు పెద్దల నుండి సమస్యలు తప్పవు. కోర్టు వ్యవహారాల్లో ఒత్తిడి, ఆందోళనలు వంటివి తలెత్తుతాయి.
 
మకరం :- స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. పీచు, ఫోం, లెదర్, గృహోపకరణాల వ్యాపారులకు పురోభివృద్ధి. మీ ఆకస్మిక ధోరణి కుటుంబీకులకు చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. దైవ సేవాకార్య క్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
 
కుంభం :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు లాభాదాయకం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. ఫైనాన్సు, బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు. పాతమిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం, ఆలోచనలు స్ఫురిస్తాయి. వాహనం నడుపుతున్నపుడు మెళకువ అవసరం.
 
మీనం :- మీరు చేసే పనులకు బంధువుల నుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. నిరుద్యోగులకు రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, ఆర్థికపరమైన ప్రోత్సాహకరమైన వార్తలు వింటారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. కోర్టు పనులు వాయిదా పడటం మంచిదని గమనించండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

04-01-2024 గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధించిన శుభం...