Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్వామాలో ఉగ్రదాడి.. ఏడుగురు పౌరులకు గాయాలు

Webdunia
ఆదివారం, 6 జూన్ 2021 (19:44 IST)
పుల్వామా జిల్లాలో మరో ఉగ్రదాడి ఘటన జరిగింది. పుల్వామా జిల్లాలో కీలకమైన పట్టణం త్రాల్‌లో ఆదివారం ఉగ్రవాదులు పట్టపగలే దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు అమాయక పౌరులు గాయపడ్డారు. 
 
పుల్వామా జిల్లాలోని త్రాల్ పట్టణంలో గల బస్టాండ్ వద్ద గస్తీ కాస్తోన్న సీఆర్పీఎఫ్ వాహనాన్ని పేల్చేయాలనే లక్ష్యంతో ఉగ్రవాదులు దాడి జరిపారు. గ్రెనేడ్లను సీఆర్పీఎఫ్ వాహనంపైకి విసరగా, అవి గురి తప్పి పేలిపోయాయి. దీంతో అక్కడి మార్కెట్ లోని వీధి వ్యాపారులు, కొనుగోలుదారులు గాయపడ్డారు. 
 
టెర్రరిస్టుల గ్రెనేడ్ దాడిలో గాయపడ్డ స్థానికులను భద్రతా బలగాలు ఆస్పత్రికి తరలించాయి. పేలుడు ఘటన తర్వాత ఆ ప్రాంతం మొత్తాన్నీ స్వాధీనంలోకి తీసుకున్న బలగాలు.. ముష్కరుల కోసం కూంబింగ్ జరుపుతున్నాయి. గ్రెనేడ్ పేలుడు తీవ్రత తక్కువగా ఉండటంతో స్థానికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 
 
ఇదిలా ఉంటే, జమ్మూ కాశ్మీర్‌ రాజౌరి జిల్లాలోని మన్యాల్ ప్రాంతంలో శుక్రవారం భద్రతా దళాలు ఉగ్రవాద రహస్య స్థావరాన్ని పేల్చి వేశాయి. ఈ సందర్భంగా ఏకే-47 రైఫిల్‌తో సహా ఐదు తుపాకీలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments